ఏడేళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. వణుకు పుట్టించే దీన్ని ఎలా చూడాలంటే!
సినీ రంగంలో ఎంతో మంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే విజయాలను అందుకుంటూ దూసుకుపోతోండగా.. కొందరు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో సందీప్ కిషన్ ఒకడు. చాలా కాలంగా వరుసగా సినిమాలు చేస్తోన్న అతడు.. హిట్లు అంతగా అందుకోవడం లేదు. అయితే, ఈ మధ్య సత్తా చాటుతున్నాడు.
కొద్ది రోజుల క్రితమే సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' అనే చిత్రంతో వచ్చి మెప్పించాడు. దీనికి థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ జోష్‌లోనే అతడు ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సందీప్ కిషన్ నటించిన మరో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. అదే.. ఏడేళ్ల క్రితం అతడు నటించిన 'ప్రోజెక్ట్ Z'

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో సీవీ కుమార్ తెరకెక్కించిన సినిమానే 'ప్రోజెక్ట్ Z'. సైన్స్ ఫిక్షనల్ హర్రర్ జోనర్‌లో తమిళంలో రూపొందిన ఈ మూవీ విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా భారీ హైప్‌తో 2017లో విడుదల అయింది. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో సందీప్ కిషన్ మూవీ సక్సెస్ సాధించింది.
సందీప్ కిషన్ - సీవీ కుమార్ కాంబినేషన్‌లో క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్టుతో రూపొందిన 'ప్రోజెక్ట్ Z' మూవీ థియేటర్లలోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత దీన్ని తెలుగులో స్ట్రీమింగ్‌కు తీసుకు రావాలని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా డిసైడ్ అయింది. ఈ మేరకు దీని స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే దీన్ని ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేసింది.

సందీప్ కిషన్ హీరోగా నటించిన 'ప్రోజెక్ట్ Z' సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మాత్రమే ఆహా సంస్థ ప్రకటించింది. కానీ, తేదీని మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మే 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తోంది. దీనిపై గురువారమే అధికారిక ప్రకటన రాబోతుందని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. సందీప్ కిషన్ హీరోగా నటించిన 'ప్రోజెక్ట్ Z' మూవీని తిరుకుమారన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీవీ కుమార్ నిర్మించారు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా చేసింది. అలాగే, జాకీ ష్రాఫ్, డేనియల్ బాలాజీ, మైమ్ గోపీ, అమరేంద్రన్‌లు కీలక పాత్రలు చేశారు. గిబ్రాన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











