Michael OTT: ఓటీటీలోకి సందీప్ కిషన్, విజయ్ సేతుపతి 'మైఖేల్'.. కేవలం 21 రోజుల్లోనే! ఎందులో అంటే?

హిట్స్, ఫ్లాప్స్ పట్టించుకోకుండా విభిన్న సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఇటీవలే తన కెరీర్ లో మొదటగా పాన్ ఇండియా చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. అయితే సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్ ఫిబ్రవరి 3న గ్రాండ్ గా విడుదల కాగా సినీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ నటించింది. లవ్ అండ్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వచ్చిన మైఖేల్ సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. ఆ వివరాల్లోకి వెళితే..

సందీప్ కిషన్ తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్నడూ కనపించని విధంగా సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకున్నాడు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ప్రమోషన్స్ బాగానే నిర్వహించారు. మైఖేల్ సినిమాలో కీలక పాత్రలు పోషించిన విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ భరద్వాజ్, వరుణ్ సందేశ్ పోస్టర్స్ తో క్యూరియాసిటీ పెంచారు. అలాగే నందమూరి బాలకృష్ణ విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఇక హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో సందీప్ కిషన్ లిప్ లాక్ తో మరింత క్రేజ్ వచ్చింది.

Sundeep Kishan Vijay Sethupathi Michael OTT Release On Aha From February 24

దివంగత నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ బ్యానర్స్ పై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు
సంయుక్తంగా నిర్మించిన సందీప్ కిషన్ మైఖేల్ సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు. తమిళంలో విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ప్రమోషన్స్ నిర్వహించగా.. ఫిబ్రవరి 3న చాలా గ్రాండ్ గా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతోపాటు హిందీ భాషల్లో విడుదలైంది. అయితే ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. లవ్ అండ్ డార్క్ థీమ్ గా వచ్చిన మైఖేల్ నిరాశపరిచిందని పలువురు పేర్కొన్నారు.

పాపులర్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్ గా నటించిన మైఖేల్ చిత్రాన్ని ప్రస్తుతం ఓటీటీలో విడుదల చేయనున్నారు. థియేటర్లలో విడుదలైన నెలలోనే ఓటీటీలోకి రిలీజ్ చేయడాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎలా నిరాశపరిచిందని. ఇదే ఫిబ్రవరి నెలలో 24వ తేదీన ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా మైఖేల్ స్ట్రీమింగ్ కానుంది. "రెడీగా ఉండండి. పిచ్చెక్కించే యాక్షన్ తో రాబోతున్నాడు మన మైఖేల్. నాన్ స్టాప్ యాక్షన్ ఎంటర్టైనర్" అని ఆహా పేర్కొంది. అంటే విడుదలైన 21 రోజుల్లోనే మైఖేల్ డిజిటల్ తెరపై సందడి చేయనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ కోసం సందీప్ కిషన్ చాలా కష్టపడ్డాడు. సుమారు 24 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X