Mazaka OTT Release: మజాకా ఓటీటీ రిలీజ్.. సందీప్ కిషన్ మూవీ ఏ ఓటీటీలో? స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

యువ హీరో సందీప్ కిషన్ హిట్ కొట్టి చాలా ఏళ్లే అవుతోంది. కోలీవుడ్, టాలీవుడ్ మధ్య చక్కర్లు కొడుతున్న ఈ కుర్రాడు వైవిధ్యమైన చిత్రాలు చేస్తున్నా అంతగా ఫలితం రాబట్టలేకపోతున్నాయి. సందీప్ గత చిత్రాలు గల్లీ రౌడీ, మైఖేల్, కెప్టెన్ మిల్లర్, ఊరు పేరు భైరవ కోన, రాయన్‌లు కథ కథనం పరంగా డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగా వచ్చాయి. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో సందీప్ కిషన్ చేసిన చిత్రమే మజాకా.

యూత్ ఎంటర్‌టైనర్స్, ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే మజాకా. ఈ సినిమాలో సందీప్ కిషన్‌కు జంటగా రీతూ వర్మ నటించారు. సీనియర్ హీరోయిన్ అన్షు అంబానీ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. అప్పెడెప్పుడో మన్మథుడు, రాఘవేంద్ర తర్వాత తెలుగు తెరకు దూరమైన అన్షు దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లో నటిస్తుండటం విశేషం. రావు రమేశ్, మురళీ శర్మ, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, హైపర్ ఆదిలు ఇతర పాత్రలు పోషించారు.

Sundeep Kishan s Mazaka OTT release when to expect this Movie to stream online

రావు రమేశ్ హీరోకు తండ్రిగా నటించడం .. ఈయనకు అన్షుకు మధ్య లవ్ ట్రాక్ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్‌లకు తోడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు త్రినాథరావు హీరోయిన్ అన్షుపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహా శివరాత్రి కానుకగా మజాకా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తండ్రీకొడుకులు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం అనే ఇతివృత్తంతో మజాకాను తెరకెక్కించారు. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఎలాంటి మేజిక్ చేయనుంది? అనేది చర్చనీయాంశమైంది.

సందీప్ కిషన్, త్రినాథరావు నక్కిన బ్రాండ్ మీద ఈ సినిమాకు రూ.10 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మజాకా హిట్ కావాలంటే రూ.11.5 కోట్లు వసూలు చేయాలని బ్రేక్ ఈవెన్‌గా విలువ కట్టారు. ఫ్యామిలీకి కనుక ఈ సినిమా ఎక్కితే వసూళ్లు బాగుంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహా శివరాత్రికి తోడు రెండ్రోజుల్లో వీకెండ్ మొదలు కానుండటంతో మజాకా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

Sundeep Kishan s Mazaka OTT release when to expect this Movie to stream online

ఇకపోతే.. సినిమా అలా రిలీజ్ అయ్యిందో లేదో .. అప్పుడే మజాకా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు ఓటీటీ లవర్స్. మజాకా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ సంస్థ జీ 5 ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందట. ఓటీటీ నిబంధనలను అనుసరించి ఐదు వారాల తర్వాత అంటే మార్చి చివరిలో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో మజాకాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే థియేట్రిల్ రన్ బాగుంటే మాత్రం కాస్త లేటైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూద్దాం మరి సందీప్ కిషన్ ఎలాంటి మేజిక్ చేస్తారో?

More from Filmibeat

Read more about: sundeep kishan ritu varma mazaka
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X