OTT లోకి సడెన్‌గా వచ్చేసిన సునీల్ కొత్త సినిమా.. చూడాలంటే కండిషన్.. ఇది రికార్డే!
సినీ ఇండస్ట్రీలో తమ హాస్య చతురతో నవ్వించే కమెడియన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్పెషాలిటీ. ఇక ఎంతో కాలంగా కమెడియన్ గా తన సత్తా చాటుతున్నాడు సునీల్ (Sunil). ఈ మధ్య సీరియల్ పాత్రలతో సైతం మెప్పిస్తున్న ఆయన కామెడీకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. కమెడియన్ తర్వాత హీరోగా, నటుడిగా, విలన్ గా ఎన్నో సినిమాలతో అలరించారు. ఇటీవల సునీల్ ప్రధాన పాత్రలో నటించి ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఆ సినిమా చూసేందుకు ఆ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఓ కండిషన్ పెట్టింది.
పాపులర్ నటుడు, కమెడియన్ సునీల్ మెయిన్ లీడ్ రోల్ చేసిన సినిమా 'భువన విజయం' (Bhuvana Vijayam Movie). యలమంద చరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేక మోస్తరుగా నడిచింది. ఎక్కువగా ప్రచారం లేని కారణంగా థియేటర్లలో ఎక్కువ రోజులు ప్రదర్శితం కాలేకపోయింది. హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్లపై పి. ఉదయ్ కిరణ్, శ్రీకాతం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

శేఖర్ చంద్రశేఖర్ సంగీతం అందించిన భువన విజయం సినిమాలో సునీల్ తోపాటు శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, ధనరాజ్, వైవా హర్ష, బిగ్ బాస్ వాసంతి కృష్ణన్, రాజ్ తిరందాసు, రాకెట్ రాఘవ, స్నేహల్ కామత్, సోనియా చౌదరి, సత్తిపండు, షేకింగ్ శేషు పలువురు నటించారు. చోటా కే నాయుడు ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టిన ఈ సినిమా ఆత్మ, యమధూతలు, సినిమా హీరో, నిర్మాత, కథా రచయితల కథాంశంతో భువన విజయం సినిమా స్టోరీ ఉంటుంది.
భువన విజయం సినిమాలో హీరో ప్రీతమ్ కుమార్ పాత్రను పోషించిన సునీల్ కు ఏడుగురు రచయితలు కథలు చెప్పేందుకు తంటాల పడటంతో వచ్చే కామెడీ ఆకట్టుకుంటుంది. థియేటర్లలో మోస్తరుగా నిలిచిన ఈ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాను చూడాలంటే రూ. 99 చెల్లించాల్సిందిగా అమెజాన్ ప్రైమ్ కండిషన్ పెట్టింది. సాధారణంగా భారీ సినిమాలకు ఇలా రెంటల్ విధానం ఉంటుంది. కానీ, చిన్న మూవీగా వచ్చిన భువన విజయంకు ఇలా రెంట్ చెల్లించే పద్ధతి విశేషం కావడమేకాకుండా రికార్డుగా చెప్పుకోవచ్చు. త్వరలో ఫ్రీగా స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











