2 OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా ఎక్కువ అయింది. అనేక అద్భుతమైన సినిమాలు ఓటీటీల్లోకి వస్తూ సందడి చేస్తున్నాయి. కొత్త వారం, పండుగలు వస్తున్నాయంటే చాలు అనేక సినిమాలు ఓటీటీల్లోకి వస్తూ సినీ ప్రియులను సర్ ప్రైజ్ చేస్తున్నాయి. అయితే ఈరోజు శుక్రవారం కావడంతో అనేక చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. అందరూ మెచ్చే అనేక కథలు రాగా.. తాజాగా ఓ అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ముఖ్యంగా రెండు ఓటీటీల్లో ఈ సినిమా సందడి చేస్తోంది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళంలో తెరకెక్కించిన అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ మూవీయే మిషన్ చాప్టర్ 1. ఈ సినిమా జనవరి 12వ తేదీన అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. తెలుగులో ఈ సినిమాను విడుదల చేయాలి అనున్నప్పటికీ కుదరలేదు. అప్పుడు థియేటర్లు దొరక్క ఆ సమస్య వచ్చింది. అయితే థియేటర్ల వద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఎ. ఎల్. విజయ్ దర్శకత్వం వహించారు.

లైకా ప్రొడక్షన్స్, శ్రీ షిర్డీ సాయి మూవీస్, న్యూ మార్చ్ ఫాస్ట్ పిక్చర్స్ మరియు ఆస్పెన్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ లిమిటెడ్ లో నిర్మించిన ఈ సినిమాలో అరుణ్ విజయ్, అభి హాసన్, అమీ జాక్సన్, నైమిషా సజయన్, భరత్ బోపన్న, జాసన్ షా, అయల్, నిక్ ఖాన్ వంటి వాళ్లు అందరూ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఐదేళ్ల విరామం తర్వాత అమీ జాక్సన్ ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. సందీప్ కె. విజయ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అలాగే ఆంథోని ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.
అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన మిషన్ చాప్టర్ 1 సినిమా వాణిజ్య పరంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లే రాబట్టింది. అయితే ఇంత కాలానికి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా మార్చి 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ముఖ్యంగా 14వ తేదీ అర్థరాత్రి 12 గంటల నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రమే కాకుండా మరో ఓటీటీలోనూ ఈ చిత్రం సందడి చేస్తోంది.

మరో ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన సింప్లీ సౌత్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఇంట్లోనే కలిసి కూర్చుని ఈ చిత్రాన్ని చూడండి.


Click it and Unblock the Notifications











