OTTలోకి సూపర్ హిట్ డ్రామా సిరీస్.. నవ్విస్తూనే ఏడిపించే దీన్ని ఎక్కడ చూడాలంటే?

రోజురోజుకూ ఓటీటీల హవా ఎక్కువ అవుతుంది. సినిమాలతో పాటు స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్ లపై ఎక్కువగా కాన్ సంట్రేట్ చేస్తున్నారు. అలాగే సినీ ప్రియులు కూడా టీవీలు, సీరియల్స్ కంటే ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లను ఎక్కువగా చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. వాటిని అర్థం చేసుకున్న చాలా మంది దర్శక, నిర్మాతలు సరికొత్త కథలతో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. ముఖ్యంగా మొదటి పార్ట్ హిట్ అయితే వాటికి వరుసగా సీక్వెల్స్ తెస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

అలా ఇప్పటికే రెండు సీజన్ లు తీసుకు వచ్చిన ఓ సూపర్ హిట్ డ్రామా వెబ్ సిరీస్ కు ఇప్పుడు మూడో పార్టును తీసుకు వస్తున్నారు. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి.. ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన పంచాయత్ సిరీస్ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరికీ తెలిసిందే. అద్భుతమైన కాథంశంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ నవ్వులు పూయించడంతో పాటు.. మదిని మెలిపెట్టే స్టోరీ కూడా ఉంటుంది.

Super Hit Drama Panchayat 3 Web Series Going to Streaming on Amazon Prime Video Check Details

అద్భుతమైన కథలతో వచ్చి అందరినీ తెగ అలరిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు మరో రెండు పార్టులు రాగా అవి సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఉద్యోగం సంపాదించేందుకు ఎన్నో సస్యలు ఎదుర్కున్న ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ ప్రయాణాన్ని ఈ పంచాయత్ వెబ్ సిరీస్ లో చక్కగా చూపించారు. ముఖ్యంగా అతడికి ఉద్యోగ అవకాశాలు దొరక్క ఓ మారమూల గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేయాలని నిర్ణయించుకున్న ఓ వ్యక్తి కథను వివరించారు. కరోనా సమయంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు విపరీతమైన స్పందన రాగా.. సీక్వెల్ తీసుకు వస్తున్నారు దర్శక, నిర్మాతలు.

ఇప్పటికే రెండు సీజన్లు రాగా ఇప్పుడు మూడో సీజన్ ను నిర్మిస్తున్నాదు. అయితే పంచాయత్ 3లో కూడా జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించనుండగా.. రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఈ వెబ్ సిరీస్ ను టీవీఎఫ్.. వైరల్ ఫీవర్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్ఖ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే తాజాగా ఈ సంస్థనే నేరుగా ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీని కన్ఫార్మ్ చేసింది. మే 28వ తేదీ నుంచి పంచాయత్ 3 వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఓటీటీ ప్రియులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేయడంతో ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ఈ వెబ్ సిరీస్ చూడాలని అంతా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి సూపర్ హిట్ డ్రామా సిరీస్ పార్ట్ 3 ఓటీటీలోకి వచ్చిన వెంటనే మీరు కూడా చూసేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X