ఓటీటీలోకి సూపర్ హిట్ డ్రామా సిరీస్.. ఏంటి, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా చాలా ఎక్కువ అయింది. టీవీలు, సీరియల్స్ కంటే ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. వాటిని అర్థం చేసుకున్న చాలా మంది దర్శక, నిర్మాతలు సరికొత్త కథలతో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. ముఖ్యంగా మొదటిది హిట్ అయితే వాటికి వరుసగా సీక్వెల్స్ తెస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అలా ఇప్పటికే రెండు సీజన్ లు తీసుకు వచ్చిన ఓ సూపర్ హిట్ డ్రామా సిరీస్ కు మూడో పార్ట్ రాబోతుంది. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి.. ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన పంచాయత్ సిరీస్ గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన కాథంశంతో వచ్చిన ఈ సిరీస్ నవ్వులు పూయించడంతో పాటు.. మదిని మెలిపెట్టే స్టోరీ కూడా ఉంటుంది. అందుకే ఈ సిరీస్ ను చూసే వాళ్ల సంఖ్య, ఇష్టపడే వారి సంఖ్య చాలా ఎక్కువ. అయితే ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లు కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఉద్యోగం సాధించడంలో ఎన్నో సస్యలు ఎదుర్కున్న ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ప్రయాణాన్ని ఈ పంచాయత్ సిరీస్ లో చూపించారు.

ముఖ్యంగా అతడికి ఉద్యోగ అవకాశాలు దొరక్క ఓ మారమూల గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేయాలని నిర్ణయించుకున్న ఓ వ్యక్తి కథను చాలా చక్కగా చూపించారు. కరోనా సమయంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు విపరీతమైన స్పందన రాగా.. సీక్వెల్ తీసుకు వస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఇప్పటికే రెండు సీజన్లు రాగా ఇప్పుడు మూడో సీజన్ ను నిర్మిస్తున్నాదు. అయితే పంచాయత్ 3లో కూడా జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించనుండగా.. రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అలాగే ఈ వెబ్ సిరీస్ ను టీవీఎఫ్.. వైరల్ ఫీవర్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్ఖ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. కానీ విడుదల తేదీని మాత్రం కన్ఫార్మ్ చేయలేదు. కానీ తాజాగా ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది తెలిపారు. ఈ ఏడాది చివరి నెలలో అంటే డిసెంబర్ లో పంచాయత్ 3 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది వివరించారు.

ఓటీటీ ప్రియులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ వెబ్ సిరీస్ పార్ట్ 3లో విపరీతమైన కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేషాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. మరి సూపర్ హిట్ డ్రామా సిరీస్ పార్ట్ 3 ఓటీటీలోకి వచ్చిన వెంటనే మీరు కూడా చూసేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











