OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌... ఎందులో చూడాలంటే?

ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు, సిరీసులు వస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక ఓటీటీ సంస్థలు కూడా వివిధ భాషల సినిమాలు, సిరీసులు డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అలా ఇప్పుడు మరో తమళ్ సూపర్ హిట్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. తమళంలో సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్... ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది.ఆ సినిమా ఏంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది.. కథేంటో వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఈ మధ్య ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. క్రైమ్, సస్పెన్స్, హార్రర్, థ్రిల్లర్ వంటి జానర్ సినిమాలు మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో ఓటీటీ సంస్థలు ఇలాంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతివారం ఏదో ఒక కొత్త సినిమాలు, సిరీసులు తీసుకువచ్చేందుకు ఓటీటీ సంస్థలు పోటీ పడి మరీ వేరే భాషల సినిమాలు తెలుగులోకి తీసుకువస్తున్నాయి. ఆ క్రమంలోనే తెలుగులోకి మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది.

Super Hit Suspense Crime Thriller Paramporul Movie Telugu Version Now Streaming on ETV Win OTT

తమిళంలో బాక్సాఫీస్ వద్ద సూపర్‌ డూపర్‌ హిట్‌ గా నిలిచిన పరంపోరుల్‌ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. పరంపోరుల్‌ సినిమాలో అమితాశ్‌ ప్రధాన్‌, శరత్ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా గతేడాది త‌మిళంలో సెప్టెంబ‌ర్ 1న థియేట‌ర్ల‌లో వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసింది.

సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్లో తెరకెక్కిన పరంపోరుల్ సినిమాలో ఆకట్టుకునే కథా, కథనాలు, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ ప్లే ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మారథం పట్టారు. ఇక బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడీ ఈ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ పరంపోరుల్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాను తెలుగు వర్షన్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఈటీవీ విన్‌ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

పరంపోరుల్ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్‌ మీడియా ద్వారా ఈటీవీ విన్‌ ఓటీటీ సంస్థ ఓ పోస్టర్ రిలీజ్ చేసి తెలిపింది. ఇక ఈ సినిమాకు ఓటీటీలోనూ మంచి ఆదరణ వస్తుంది. పరంపోరుల్ సినిమాను అర‌వింద్‌ రాజ్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో క‌శ్మీరా ప‌ర‌దేశీతో పాటు బాలాజీ శ‌క్తివేల్ కీలక పాత్రల్లో నటించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చారు.

Super Hit Suspense Crime Thriller Paramporul Movie Telugu Version Now Streaming on ETV Win OTT

ఇక పరంపోరుల్ సినిమా కథ విషయానికొస్తే.. ఆది (అమితాశ్‌ ప్రధాన్‌) నీతి, నిజాయితీగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల విగ్రహాలు చోరీ చేసే ముఠా సభ్యులతో జతకడుతాడు.

ప్రముఖ పోలీస్ ఆఫీస‌ర్ మైత్రేయ‌న్‌ తో (శ‌ర‌త్‌ కుమార్‌) క‌లిసి ప‌నిచేయ‌డానికి ఒప్పుకుంటాడు. మరి ఆ ఒప్పందం ఆది జీవితాన్ని ఎలా మార్చేసిందనేది పరంపోరుల్ సినిమా కథగా తెరకెక్కించారు. ఈ ఆదివారం మంచి యాక్షన్ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని చూడాలనుకునే వారు ఈ పరంపోరుల్‌ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక మీరు ఈ సినిమాను చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X