OTTలోకి రాబోతున్న మరో సూపర్ నేచురల్ హార్రర్ డిటెక్టివ్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఈ మధ్య కాలంలో అనేక అదిరిపోయే వెబ్ సిరీస్ లు, సినిమాలు ఓటీటీల్లో తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా హార్రర్, కామెడీ, థ్రిల్లర్ చిత్రాలకు రోజురోజుకూ.. డిమాండ్ పెరుగుతోంది. అది అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతలు అలాంటి కథలతోనే వస్తూ సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నారు. అయితే ఇప్పటికీ అనేక హార్రర్, థ్రిల్లర్, కామెడీ చిత్రాలు, వెబ్ సిరీస్ లో ఈ నెలలో రాగా.. మరో క్రేజీ సూపర్ నేచురల్ హార్రర్ కామెడీ డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఓటీటీ సంస్థ తాజాగా ఓ సూపర్ నేచురల్ హారర్ డిటెక్టివ్ కామెడీ వెబ్ సిరీస్ ను తెరకెక్కించింది. ఆ వెబ్ సిరీస్ పేరే.. డెడ్ బాయ్ డిటెక్టివ్స్. అదిరిపోయే కథాంశంతో అందరినీ ఆకట్టుకునేందుకు తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ కు నీల్ గైమాన్, మాట్ వాగ్నెర్ లు కథను అందించారు. అలాగే చాలా మంది దర్శకత్వం వహిస్తూ.. ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ముఖ్యంగా ఆరుగురు డైరెక్టర్లు.. మనిషికో ఎపిసోడ్ ను తెరకెక్కించారు. ఒక్క గ్లెన్ వింటర్ మాత్రమే రెండు ఎపిసోడ్ లను రూపొందించారు.

ఇలా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండే ఈ వెబ్ సిరీస్ ను చూసేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఓ మనిషి చనిపోయిన తర్వాత అతడు ఎక్కడికి వెళ్తాడు, వేరే లోకంలో ఉండగా... వారు సహజ మానవులకు ఎదురు పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓ వైపు భయాన్ని కల్గిస్తూనే మరోవైపు కామెడీని అందించబోతుంది. వెన్నులో వణుకుపుట్టించే భయంతో పాటు కడుపు చెక్కలయ్యేలా నువ్వాలనుకే వాళ్లకు ఈ వెబ సిరీస్ కరెక్ట్ సెట్ అవుతుంది.
ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించింది. అయితే త్వరలోనే అందుబాటులోకి తీసుకు వస్తామని గతంలో ఎక్స్ వేదికగా ప్రకటించిన ఈ సంస్థ తాజాగా డెడ్ బాడీ డిటెక్టివ్స్ వెబ్ సిరీస్ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్స్ ను నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వివరించింది. మరి అద్భుతమైన హార్రర్, కామెడీ కాన్సప్ట్ తో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను ప్రతీ ఒక్కరూ చూసేయండి. ఇంట్లోనే కూర్చుని ఫుల్ గా ఎంజాయ్ చేసేయంండి.


Click it and Unblock the Notifications











