ఓటీటీలోకి సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడాలంటే?
ఈ మధ్య కాలంలో ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలు, థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఎక్కుగా వస్తున్నాయి. చాలా మంది వీటిని చూసేందుకు ఇష్ట పడుతుండడంతో ఎక్కువ మంది వీటిపైనే ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో అయితే సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో వస్తూ తెగ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా మరో అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి, ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
డార్క్ కామెడీతో పాటు సైకలాజికల్ థ్రిల్లర్ గా ఓ అద్భుతమైన వెబ్ సిరీస్ రాబోతుంది. దాని పేరే ఎల్ఎస్‌డీ. శివ కోన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో నేహా దేశ్‌పాండే, ప్రాచీ ఠాకర్, ప్రభాకర్ పొడకండ్ల, శివ కోన, అభిలాష్ బండారి, కునాల్ కౌశిక్, మరియు రమ్య దినేష్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. లవ్, సెక్స్, డెత్ కాన్సెప్ట్ తో మూడు జంటల మధ్య జరిగే సన్నివేషాలను ఆద్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఈ విషయం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తుంటేనే అర్థం అవుతుంది.

అనిల్ మోదుగ, శివ కోనలు కలిసి నిర్మించిన ఈ ఎల్ఎస్‌డీ వెబ్ సిరీస్ కు.. రవి సంద్రాన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేశారు. అలాగే ప్రవీణ్ మణి, శశాంక్ తిరుపతిలు సంగీత దర్శకులుగా వ్యవహరించారు. పవన్ గుంటుకు, హరీష్ ఈడిగలు సినిమాటోగ్రఫీ పనులు చూసుకోగా.. ఎడిటర్ గా కూడా శివ కోననే పని చేశారు. అందరికీ నచ్చే.. అందరూ మెచ్చే రీతిలో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను ఫిబ్రవరి 2వ తేదీన ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ సందడి చేయనుందో మనం ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఎమ్ఎక్స్ ప్లేయర్ లో ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయనున్నారట. ఫిబ్రవరి రెండో తేదీ అంటే ఈ శుక్రవారం రోజు నుంచే ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు హిందీ భాషలో అందుబాటులోకి రాబోతుంది. థ్రిల్లర్ స్టోరీలను ఇష్టపడే వారు ఈ వెబ్ సిరీస్ ను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా స్నేహితులతోనే లేదా ఫ్యామిలీ మెంబర్స్ తోనే ఇంట్లోనే కలిసి కూర్చుని ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ను చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











