OTTని షేక్ చేస్తున్న 2 సూపర్ హిట్ సినిమాలు.. ఎందులో చూడాలంటే?
ప్రస్తుతం ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలు వరుసగా స్ట్రీమింగ్ అవుతూ రికార్డులు బద్దలు కొడుతున్నాయి. కోట్ల కొద్ది వ్యూస్‌ను దక్కించుకుంటూ దూసుకెళ్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓ రెండు చిత్రాలైతే ఓటీటీ ప్రియులను నెట్‌ఫ్లిక్స్ వైపే చేసేలా చేస్తున్నాయి. అవే భారీ యాక్షన్ డ్రాప్ 'సలార్', 'యానిమల్' చిత్రాలు. ఇప్పుడంతా సినీ ప్రియులు ఈ మూవీస్‌నే చూసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో చూసిన వారు కూడా మరోసారి చూసేందుకు రెడీ అయిపోతున్నారు. ఎలాగో వీకెండ్ వచ్చేసింది కాబట్టి మీరు కూడా వీలైతే ఈ చిత్రాలను చూసి ఆస్వాదించండి..
'సలార్' విషయానికొస్తే - జానపదం, సాంఘికం, పౌరాణికం, చారిత్రాత్మకం.. ఇలా ప్రపంచ దేశాల్లో సినిమా ఎన్ని రకాలుగా ఉంటుందో వాటన్నింటినీ ఒకే చోట ఉంచితే అదే 'సలార్'. ఖాన్సార్ సామ్రాజ్యం నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం. 700 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించింది.

అలా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదే హవా కొనసాగిస్తోంది. రీసెంట్గా నెట్‌ఫ్లిక్స్ వేదికగా రిలీజైన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా అత్యధిక వీక్షణలతో టాప్ ట్రెండింగ్‌లో దూసుకువెళ్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా సినిమా చూసిన మూవీ లవర్స్ అంతా ప్రశాంత్ నీల్ డైరెక్షన్, ప్రభాస్ యాక్షన్, కటౌట్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తూ నెట్టింట సలార్ హ్యాష్ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో #SalaarGoesGlobal హ్యాష్ ట్యాగ్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎలాగో నెట్‌ఫ్లిక్స్‌కు భారత్‌లో కన్నా విదేశాల్లో సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ ఉండడంతో వారంతా సలార్‌ను చూసి బాగుందంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సలార్ మేనియానే ఎక్కువగా కొనసాగుతోంది. గతంలో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి కూడా ఈ రేంజే రెస్పాన్సే వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సలార్ ఆ స్థాయి ఆదరణను అందుకుంది.
ఇక యానిమల్ సినిమా విషయానికొస్తే - పక్కా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ప్యూర్ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామాగా రిలీజై సూపర్ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. రణ్‌బీర్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడీ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇది కూడా వచ్చీ రాగానే సలార్‌తో పాటు ఓటీటీని షేక్ చేయడం ప్రారంభించేసింది.
మైండ్ బ్లాక్ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటూ దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ చాక్లెట్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.900కోట్లతో సంచలనం సృష్టించింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన వారు, మరోసారి చూడాలనుకుంటున్న వారు ఈ సినిమా చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 26న అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications











