ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టాప్ 3 సినిమాలు.. 1లో యానిమల్, ఆ తర్వాతి స్థానాల్లో!
ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. అందులో చాలా పెద్ద పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఉండగా.. ఎవరూ ఊహించని స్థాయిలో కోట్ల కొద్ది వ్యూస్‌ను దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు అయితే ఓటీటీని షేక్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. అయితే ఆ టాప్ 3 సినిమాలు ఏవి, అవి ఎక్కుడ స్ట్రీమింగ్ అవుతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
డిసెంబర్ ఒకటో తేదీన యానిమల్ సినిమా థియేటర్లలో చాలా గ్రాండ్ గా విడుదల చేశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను టి - సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. పక్కా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ప్యూర్ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామాగా రిలీజై సూపర్ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది.

రణ్‌బీర్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇటీవలే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేధికగా ఓటీటోలిక వచ్చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.900కోట్లతో సంచలనం సృష్టించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమాను ఇప్పటికీ చాలా మంది చూసేస్తున్నారు.
సామ్ బహదూర్ అనే సినిమా ప్రస్తుతం జీ5 వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. భారత ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా జీవితం ఆధారంగా ఆర్‌ఎస్‌విపి మూవీస్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. విక్కీ కౌషల్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, నీరజ్ కబీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల కాగా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. జనవరి 26 నుండి స్ట్రీమింగ్ అవుతుండగా.. విశేష ప్రేక్షకాదరణ పొందింది.

ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధా జోషిల నిజ జీవిత వృత్తాంతంతో ప్రేరణ పొంది రాసిన '12th ఫెయిల్' నవల ఆధారంగా వినోద్ చోప్రా ఫిల్మ్స్ బ్యానర్‌పై విధు వినోద్ చోప్రా, యోగేష్ ఈశ్వర్ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 27వ తేదీన గ్రాండ్ గా విడుదల చేశారు. , మేధా శంకర్, ప్రియాంశూ ఛటర్జీ, సంజయ్ బిష్నోయి, హరీష్ ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు విధూ వినోద్ చోప్రా దర్శకత్వం వహించారు. డిసెంబర్ 29 నుండి హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











