OTTలో గుండెల్ని బరువెక్కించే ఎమోషనల్ డ్రామా... నేషనల్ వైడ్‌గా టాప్1లో ట్రెండింగ్!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం డంకీ. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 21న సలార్ సినిమాకు పోటీగా థియేటర్లోకి వచ్చింది. ఇక ఈ సినిమా దాదాపు 470 కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ ఎమోషనల్ డ్రామా ఇటీవల ఓటీటీలోకి రాగా.. ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
గత ఏడాది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచాయి. పఠాన్, జవాన్ సినిమాలు కమర్షియల్ సినిమాలు కాగా... డంకీ ఎమోషనల్ డ్రామా. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ లో తాప్పీ హీరోయిన్ గా నటించగా... విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ అప్పుడే సలార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయిన సలార్ చిత్రానికి పోటీగా డిసెంబర్ 21న డంకీ సినిమా రిలీజ్ అయింది. అయితే డంకీ కేవలం హిందీలోనే రిలీజ్ కాగా.. అయినప్పటికీ సూపర్ హిట్ గా నిలిచింది. పఠాన్, జవాన్ సినిమాలంత మెప్పించకపోయినా బాక్సాఫీస్ వద్ద డంకీ రూ. 470 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
డంకీ చిత్రంతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద షారుక్ స్టామినా ఏంటో మరోసారి రుజువు అయింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన డంకీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక ఎట్టకేలకు డంకీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రావడమే ఆలస్యం టాప్ 1 పోజిషన్లో చోటుదక్కించుకుంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నేషనల్ వైడ్ గా టాప్ 1లో దూసుకుపోతుంది. ఇక టాప్ 2లోనూ షారుఖ్ బ్యానర్ నుంచి వచ్చిన భక్షక్ నిలవడం విశేషం.
ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన కొద్ది గంటల్లోనే డంకీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో చేరింది. కాగా డంకీ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు కూడా హిందీలోనే స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడంతో తెలుగు అడియెన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో తెలుగు ఆడియెన్స్ చూసేందుకు వీలుగా ఉంది.

ఇక డంకీ సినిమా కథ విషయానికి వస్తే.. లండన్ వెళ్లి బాగా బతకాలనుకొనే కొంతమంది వీసా రిజెక్ట్ అవ్వడంతో అడ్డదారిలో దేశాలు దాటుతూ ఉంటారు మరి వారు ఎలా వెళ్లారు? వెళ్లే మార్గంలో ఎన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ? లండన్ వెళ్లాక వారికి ఏమైందనేది డంకీ సినిమా కథ. దీనికి ఎమోషనల్ టచ్ ఇస్తూ రాజ్ కుమార్ హిరానీ అద్బుతంగా రూపొందించాడు. మరి థియేటర్స్ లో డంకీ సినిమాను మిస్ అయితే ఈ వీకెండ్‌లో ఎంచెక్కా ఓటీటీలోనే చూసేయండి. ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











