OTTలో రికార్డులు తిరగరాస్తున్న మోస్ట్ కాంట్రవర్సీ మూవీ.. మీరు చూశారా?
రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో, సమాజంలో జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాలను ఎదురిస్తూ, ప్రశ్నిస్తూ సిల్వర్ స్క్రీన్‌పై ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అందులో చాలా వరకు కాంట్రవర్సీగా నిలిచాయి. అలానే బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ టాక్‌ను కూడా అందుకున్నాయి. అయితే కొన్నేళ్ల క్రితం కేరళలో ఎంతో మంది మహిళలు అదృశ్యమవ్వడం చర్చనీయాశంమైంది.
ముఖ్యంగా యువతులనే లక్ష్యంగా చేసుకుని మరీ మత మార్పిడులను ప్రోత్సహించి ఐసిస్ వంటి ఉగ్ర సంస్థల్లోకి వారిని పంపుతున్నట్లు తీవ్రంగా ఆరోపణలు వచ్చి పెద్ద దూమారమే చెలరేగింది. రాజకీయంగానూ పెద్ద ఎత్తులో వివాదమే చెలరేగింది. ఆ నిజ సంఘటనల ఆధారంగానే ది కేరళ స్టోరీని తెరకెక్కించారు మేకర్స్. అప్పట్లో థియేటర్లలో సంచలనం రేపిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రికార్డులు మీద రికార్డులు తిరగరాస్తూ బౌండరీలను బ్రేక్ చేస్తోంది. దాని గురించే ఈ కథనం...

ఎన్నో రాష్ట్రాలు బ్యాన్ చేశాయి : ఈ చిత్రం రిలీజైనప్పుడు పెద్దగా ఆర్భాటం లేదు. సాదాసీదా చిన్న చిత్రంగా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా మౌత్ టాక్‌తో ఊపందుకుంది. ఎంతలా అంటే ప్రభంజనాలే సృష్టించింది. సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. అందరూ దీని గురించే మాట్లాడటం మొదలుపెట్టారు. రాజకీయంగానైతే పెద్ద దుమారమే చెలరేగింది. సినిమాను బ్యాన్ చేయాలని చాలా మంది ఆందోళనలు చేశారు. దీంతో చాలా రాష్ట్రాలు ఈ చిత్రాన్ని నిషేధించాయి కూడా.
రూ.15 కోట్లు బడ్జెట్‌తో రూ.300 కోట్లు :
అయినా కూడా ఏమాత్రం ఈ కేరళ స్టోరీ సినిమా జోరును తగ్గించలేకపోయాయి. కేవలం రూ.15కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఫుల్ రన్ టైమ్‌లో దాదాపు రూ.300 కోట్లు కలెక్షన్స్ వసూళ్లు వచ్చాయి. 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది. ఎందుకంటే ఆ రేంజ్లో ఈ సినిమాకు చూసేందుకు థియేటర్లకు తండోపతండాలుగా వచ్చారు.
IMDbలోనూ భారీ చిత్రాలైన పొన్నియన్ సెల్వన్2, పఠాన్లకన్నా ఈ సినిమాకే భారీ రేటింగ్ వచ్చింది. దీంతో చిత్రంతో నటించిన నటి అదా శర్మ ఏడాది పొడవునా హాట్ టాపిక్‌గానే నిలిచింది. సోషల్ మీడియా అంతా ఆమె గురించే చర్చంతా.
ఓటీటీలో సెన్సేషనల్ రికార్డ్ :
ఇకపోతే ఈ చిత్రాన్ని సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ షా నిర్మించారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా విడుదలైన దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలోకి రీసెంట్గా వచ్చింది. వచ్చీ రాగానే ఇప్పుడు ఓటీటీలోనూ సెన్సేషనల్ రికార్డ్ సృష్టిస్తోంది. బౌండరీలు బ్రేక్ చేస్తూ రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ప్రముఖ ఓటీటీ జీ5లో రికార్డ్ స్థాయిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీకెండ్లో 150కు పైగా వాచ్ మినిట్స్ అందుకున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది ఓటీటీ సంస్థ. ఒకవేళ మీరు కనుక థియేటర్లో మిస్ అయితే ఈ సినిమాను మీ ఇంట్లోనే చూసేయండి...


Click it and Unblock the Notifications











