OTTలోకి వచ్చేసిన బిగ్గెస్ట్ హారర్ మూవీస్.. మీరు ఈ 3 సినిమాలను చూసే ధైర్యం చేయగలరా?
హారర్ సినిమాలు అంటే చాలా మందికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. భయపెట్టే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. ఇక హారర్ సినిమాలు భయపెడుతునే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలుస్తాయి. ఎంత భయపెడితే.. అంత హిట్ అవుతాయన్నమాట. ఇక మూవీ లవర్స్ కోసం ఓటీటీ సంస్థలు కూడా ఈ తరహా సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. అయితే ఓ మూడు హారర్ సినిమాలు ఇప్పుడో ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అసలు ఆ సినిమాలు ఏంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
3 హరర్ సినిమాలు : భయపెట్టే హారర్ చిత్రాలను ప్రేక్షకులు భయపడుతూనే చూస్తుంటారు. వాటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు.ఇక ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థలు కూడా హారర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాయి. అయితే ఓ మూడు బిగ్గెస్ట్ హారర్ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. వీటిని చూడాలంటే కాస్త డేర్ ఉండాల్సిందే. ఆ సినిమాలు ఏంటంటే.. హాలీవుడ్ లో భయపెట్టిన సూపర్ హిట్ హారర్ మూవీస్ లో సాటెన్, ది నన్ 2, ది ఎగ్జార్సిస్ట్. ఇవి ఓటీటీలో సందడి చేస్తున్నాయి.

సా టెన్ సినిమా : సాటెన్.. ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 29 ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. 13 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 111 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. సా ఫిల్మ్ సిరీసులో ఇది పదో సినిమా. అందుకే సా టెన్ పిలుస్తాం. 2004లో ఈ సీక్వెల్ లో మొదటి సినిమా రాగా... 2010 వరకూ ప్రతి ఏడాది ఫ్రాంఛైజీ నుంచి సీక్వెల్ విడుదల అయి సూపర్ సక్సెస్ అయింది. ఇక 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత 2017లో జిగ్సా మూవీ విడుదల అయింది. ఇది ఫ్రాంఛైజీలో వచ్చిన 8వ మూవీ కాగా... ఇక 2021లో స్రైరల్ పేరుతో 9వ మూవీ వచ్చింది.
లయన్ గెట్స్ ఓటీటీలో : ఇక 2023లో సా టెన్ రిలీజ్ అయి సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సాటెన్ మూవీ లయన్ గెట్స్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫిబ్రవరి 23 నుంచి తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరో క్యాన్సర్ తో బారిన పడి చికిత్స కోసం మెక్సికో వెళ్లగా... అక్కడ ఓ ప్రయోగాత్మక ట్రీట్మెంట్ రెడీ అవుతాడు. ఆ తర్వాత అదంతా ఓ స్కామ్ అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సా టెన్ మూవీ.

జియో సినిమాలో ది ఎగ్జార్సిస్ట్ : మరో హారర్ మూవీ ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ది ఎగ్జార్సిస్ట్ మూవీ హాలీవుడ్ లోని ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ సినిమాలలో ఒకటి. హారర్ ఫ్రాంచైజ్ చిత్రాలకు హైప్ క్రియేట్ చేసిందే ఈ సినిమా. నాలుగు నెలల క్రితం థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా భయపెట్టింది. ఇప్పుడు ఓటీటీలో భయపెట్టేస్తోంది.
జియో సినిమాలో ది నన్ 2 సినిమా : ఇక మరో వణికించే చిత్రం 'ది నన్ 2'. ఇది కూడా ఓటీటీలోకి వచ్చేసింది. 'ది నన్' చిత్రం 2018లో రిలీజ్ కాగా.. దానికి సీక్వెల్ గత ఏడాది 'ది నన్2' రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. థియేటర్లలో ప్రేక్షకులను ఓ రేంజ్‌లో భయపెట్టిన ఈ బ్లాక్ బస్టర్.. ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. 'ది నన్ 2' కూడా జియో సినిమాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళంలో కూడా 'ది నన్ 2' అందుబాటులో ఉంది. మీరు ఈ మూడు సినిమాలను చూసే సాహసం చేయగలిగితే ఈ సండే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











