OTTలో దుమ్మురేపుతున్న సూపర్ హిట్ తెలుగు సినిమా... ఆ 3 భాషల్లో ట్రెండింగ్!
మూవీ లవర్స్‌కు ప్రతివారం ఓటీటీలో సరికొత్త కంటెంట్ సినిమా సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. అలానే థియేటర్స్‌లో విడుదలైనవి కూడా వస్తుంటాయి. అయితే థియేటర్లలో కొన్ని మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నవి కూడా ఓటీటీలో సూపర్ హిట్ అవుతుంటాయి. రికార్డ్ స్థాయిలో వ్యూస్‌ను అందుకుంటూ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ తెలుగు సినిమానే నెట్‌ఫ్లిక్స్‌లో పైగా మూడు భాషల్లో అదిరిపోయే రేంజ్లో టాప్ పొజిషన్లో ట్రెండింగ్ అవుతోంది. మరి దాన్ని మీరు చూడాలనుకుంటే ఎప్పుడు ఎక్కడ చూడాలో ఈ స్టోరీ చదివి తెలుసుకుందాం..
ఈ సంక్రాంతికి నాలుగు చిత్రాలు వచ్చి బాక్సాఫీస్ ముందు సందడి చేశాయి. హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ రిలీజై మంచి వసూళ్లను కూడా సాధించాయి. అవి విడుదలై ఇప్పుడు నెల రోజులు కానుండడంతో ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వచ్చేశాయి. ఆడియెన్స్‌ను తెగ అలరిస్తున్నాయి. వీటిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం ఒకటి. థియేటర్లో ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూ అందుకున్నప్పటికీ వసూళ్ల పరంగా ఘాటు బాగానే చూపించింది. ఇప్పుడదే ఘాటును ఓటీటీలోనూ చూపిస్తూ దున్నేస్తుంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ మధ్యే రెండు రోజుల క్రితం ఫిబ్రవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులో వచ్చింది. అంతే ఇక ఆ రోజు నుంచే ఓటీటీ ఆడియెన్స్ సినిమాకు బ్రహ్మరథం పట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా మరో రికార్డ్‌ను అందుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా చార్టులో టాప్ పొజిషన్‌కు చేరుకుంది.
తెలుగు వెర్షన్ నంబర్ 1 స్థానాన్ని అందుకుంది దూసుకెళ్తోంది. అలానే హిందీ, తమిళ వెర్షన్‌లకు కూడా భారీ స్పందన దక్కుతోంది. ఈ భాషల్లోనూ భారీ వ్యూయర్ షిప్ దక్కుతోంది. హిందీ వెర్షన్ అయితే ట్రెండింగ్‌లో 3వ స్థానంలో ఉండగా తమిళం 5వ స్థానంలో కొనసాగుతోంది. తెలుగులో అంటే ఓకే కానీ మహేశ్ సినిమా ఇతర భాషల్లోనూ బాగా ఆడటం మంచి విషయమే. దీంతో మహేశ్ అభిమానులు మస్త్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మా మహేశ్ బాబు పాన్ ఇండియా బాబు అంటూ నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు.

ఇకపోతే ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.180కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకుంది. అలాగే రూ.115 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. అలానే వరుసగా మహేశ్ సినిమాకు రూ.100 కోట్ల షేర్ దాటడం ఇది ఐదో సారి కావడం విశేషం. ఇక ఈ చిత్రంలో మహేశ్ బాబుకు జోడిగా శ్రీలీల నటించింది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్. రమ్య కృష్ణన్ తల్లిగా నటించింది. ప్రకాష్ రాజ్, ఈశ్వరీ రావు, జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. హారిక & హాసిని క్రియేషన్స్ సినిమాను నిర్మించింది. నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు.
తమన్ సంగీతం అందించారు. సాంగ్స్ మాత్రం బాగా హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా శ్రీలీలతో పోటీ పడుతూ కుర్చీ మడతపెట్టే సాంగ్‌కు మహేశ్ వేసిన డ్యాన్స్ అదిరిపోయింది. అలా థియేటర్లో కుర్చీలు మడతపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ దూకుడు చూపిస్తూ కుర్చీ మడతపెడుతోంది.


Click it and Unblock the Notifications











