OTTలో అదరగొడుతున్న తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ... మీరు చూశారా?

ఇప్పుడు ఎక్కడ చూసిన హనుమాన్ నామస్మరణ వినిపిస్తుంది. ఏ సోషల్ మీడియా మాధ్యమం ఓపెన్ చేసినా.. హనుమాన్ సినిమా గురించే. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో రచ్చలేపోతుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఏ తెలుగు సినిమాకు దక్కని ఆదరణ ఈ సినిమాకు ఓటీటీలో వస్తోంది. ఈ సినిమా ఓటీటీలో సాధించిన రికార్డులు ఏంటి.. దీనికి ప్రేక్షకులు ఎందుకు కనెక్ట్ అయిపోయారనేది స్టోరీలో తెలుసుకుందాం.

యువ హీరో తేజ సజ్జా, నటి అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హనుమాన్. అ!, కల్కి, జాంబిరెడ్డి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. చిన్న సినిమాగా రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించింది. జనవరి 12న సంక్రాంతి కానుకగా స్టార్ హీరోల సినిమాలకు పోటీగా హనుమాన్ వచ్చి భారీ విజయాన్ని సాధించింది.

Super Response To Prashanth Varma HanuMan Movie Streaming on Zee5 OTT 207 Millions Streaming Minutes in 5Days

ఇక థియేటర్ల వద్ద రికార్డులు బద్దలు కొట్టిన హనుమాన్ మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన హనుమాన్ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అదే ట్రెండ్ ను కొనసాగిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 హనుమాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమా సినీ ప్లెక్స్ టీవీలో హిందీలో ప్రసారం అయింది. ఇక జీయో సినిమాలో కూడా హిందీలో అందుబాటులోకి వచ్చింది.

ఆ తర్వాత తెలుగు వర్షన్ గురించి నెటిజన్స్ అసహనం వ్యక్తం చేయగా.. మార్చి 17న ఆదివారం ఉదయం నుంచి జీ5 ఓటీటీలో హనుమాన్ దర్శనం ఇచ్చింది. జీ5 లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే మిలియన్ నిమిషాల పాటు ప్లే అయి రికార్డు సృష్టించింది హనుమాన్ చిత్రం. ఇక ఈ సినిమా ప్రస్తుతం అదే ఫ్లాట్ ఫారమ్ లో రికార్డులు కొల్లగొడుతుంది. ఇక తాజాగా ఈ సినిమా 5 రోజుల్లోనే 207 మిలియన్ నిమిషాల మార్కును దాటేసి రికార్డులు సృష్టించింది.

Super Response To Prashanth Varma HanuMan Movie Streaming on Zee5 OTT 207 Millions Streaming Minutes in 5Days

ఒక్క తెలుగులోనే రిలీజ్ అయినప్పటికీ ఇన్ని మిలియన్ వ్యూస్ దక్కడం గ్రేట్. ఇక ఈ సినిమా త్వరలో ఇతర దక్షిణాది భాషల్లో కూడా విడుదల కానుందని సమాచారం. మరి అన్ని భాషలను కలుపుకుని ఓటీటీలో హనుమాన్ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందోనని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఈ సినిమాను థియేటర్లో చూసినా.. మరోసారి ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ కు చూసి ఎంజాయ్ చేయండి.

ఇక హనుమాన్ చిత్ర విషయానికి వస్తే... జనవరి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం మహేష్ బాబు గుంటూరు కారం వంటి పెద్ద సినిమాతో పోటీ పడి మరీ గెలిచింది. హిందీ వెర్షన్లో కూడా 62 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్ లో కూడా 57 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. టోటల్ గా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X