OTTలో అదరగొడుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్.. ఎందులో చూడాలంటే?

ఓటీటీలో సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ అదరగొడుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించి స్పై యాక్షన్ థ్రిల్లర్ టైగర్ 3. ఇక ఈ సినిమాకు మనీశ్ శర్మ దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం నవంబర్ 12న పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించింది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయి.. దుమ్ములేపుతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గత ఏడాది నటించిన చిత్రం టైగర్ 3. ఈ సినిమా నవంబర్ 12న రిలీజ్ అయి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా రికార్డు వసూళ్లు లేకుండా బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయాన్ని సాధించింది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 300 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. ఈ సినిమా బిజినెస్ 300 కోట్ల రూపాయలుగా నమోదు చేసుకుంది.

Super Response to Salman Khans Tiger 3 on Amazon Prime Video OTT

ఇక టైగర్ 3 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లను రాబట్టింది. హిందీ వెర్షన్ 260 కోట్లకు పైగానే వసూలు చేసింది. అన్ని భాషల్లో కలిపి ఈచిత్రం 287 కోట్లు షేర్, 334 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 121 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు పైగానే రాబట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు మనీశ్‌ శర్మ దర్శకత్వం వహించాడు. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.

టైగర్ 2 మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఇటీవల ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. వివిధ దేశాల్లో రికార్డు స్థాయి వ్యూస్‌ ను సొంతం చేసుకుంటుంది. భారత దేశంతో పాటు, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌, యూఏఈ, సింగపూర్‌, మలేషియా, ఒమన్‌, ఖతార్‌ తదితర దేశాల్లో ఎక్కువ మంది వీక్షిస్తున్న టాప్‌-10 ఓటీటీ చిత్రాల్లో టైగర్ 3 నిలిచింది.

Super Response to Salman Khans Tiger 3 on Amazon Prime Video OTT

టైగర్ 3 మూవీ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కింది. ఇక ఈ మూవీలో సల్మాన్‌ తన యాక్షన్‌తో మెప్పించాడు. షారుక్‌ ఖాన్‌ కూడా గెస్ట్ రోల్ లో మెరిసిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి నటించిన యాక్షన్‌ సీన్స్‌ సినిమాకే హైలైట్‌ గా నిలిచాయి. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ బ్రేక్‌ డౌన్‌ వీడియోను కూడా యశ్‌ రాజ్‌ఫిల్మ్‌ తాజాగా రిలీజ్ చేసింది కూడా. సల్మాన్‌ షారుక్‌ ఖాన్ మధ్య సీన్స్ ఎలా చిత్రికరించారో వాటికి వీఎఫ్ఎక్స్ ఎలా జోడించారనే అనే విషయాలను వీడియోలో చూపించారు. ఇక ఈ సినిమాను మిస్ అయితే గనుక ఓటీటీలో ఇంట్లోనే కూర్చొని ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X