OTTలోకి రాబోతున్న సూపర్ సెన్సేషనల్ క్రైమ్ సిరీస్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
ఓటీటీలోకి ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త వెబ్ సిరీసులు వస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చి అందరినీ ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నా ప్రముఖ ఓటీటీల నిర్వాహకులు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంతా క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, రియల్ స్టోరీలను చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
ఆ విషయాన్ని అర్థం చేసుకున్న ఓటీటీ నిర్వాహకులు కూడా అద్భుతమైన కాన్సెప్టులతో వచ్చి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ అద్భుతమైన వెబ్ సిరీస్ ను తెరెకెక్కించారు. ముఖ్యంగా ఆస్కార్ విన్నింగ్ ప్రొడక్షన్ సంస్థ క్యూసీ ఎంటర్ టైన్ మెంట్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించింది. బాలీవుడ్ హాట్ అండ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ కూడా ఈ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సూపర్ సెన్సేషనల్ క్రైమ్ వెబ్ సిరీస్ ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అడవుల్లో వణ్య ప్రాణులపై ముఖ్యంగా ఏనుగులపై జరిగిన దాడుల ఆధారంగా పోచర్ అనే వెబ్ సిరీస్ ను తరెక్కించారు. దీనికి ఎమీ అవార్డును అందుకున్న ఓ సక్సెస్ ఫుల్ డైరక్టర్ రిచీ మెహతా దర్శకత్వం వహించారు. అలాగే నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య, అంకిత్ మాధవ్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ను విడుదలకు ముందే సుడాన్స్ ఫిల్మ్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించగా.. అద్భుతమైన రెప్సాన్స్ వచ్చింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.

అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ క్రైమ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మూవీ టీం వెల్లడించింది. ముఖ్యంగా ఈనెల 23వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ ను అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. అడవి జంతువులపై జరిగే దాడుల గురించి చక్కగా వివరించిన ఈ వెబ్ సిరీస్ ను కచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. అస్సలే మిస్ కాకండి.


Click it and Unblock the Notifications











