OTTలోకి రాబోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ మల్టీస్టారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కొత్త వారం వస్తోందంటే చాలు అనేక కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీల వేదికగా వస్తూ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా త్వరత్వరగా ఓటీటీలోకి వస్తూ.. సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలు కూడా నెలలోపే ఓటీటీలోకి వస్తుండగా.. మరికొన్ని సినిమాలు మాత్రం కాస్త ఆలస్యంగా వస్తున్నాయి. అలా ఆలస్యంగా వస్తున్న వాటిల్లోనే సూపర్ స్టార్ రజినీ కాంత్ మల్లీ స్టారర్ చిత్రం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. ఆ సనిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా.. ఆయన కూతురు ఐశ్వర్యా రజినీ కాంత్ డైరెక్షన్ లో వచ్చిన సీరెంట్ మూవీయే లాల్ సలామ్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించిన ఈ సినిమాలో రజినీ కాంత్ తో పాటుగా.. విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత, విఘ్నేష్, లివింగ్ స్టన్, సెంథిల్, కెఎస్ రవి కుమార్, తంబి రామయ్య, నిరోషా, అనంతిక సినీల్ కుమార్, వివేక్ ప్రసన్న, ధన్య బాలకృష్మ, తంగదురై, ఆకాష్ సహాని, పోస్టర్ నందకుమార్, ఆదిత్య మీనన్, పాండి రవి, కపిల్ దేవ్ వంటి వాళ్లు ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో నటించి మెప్పించారు.

Super Star Rajini Kantha Recent Multi Starrer Movie Lal Salaam OTT Streaming Details Here

పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. ముఖ్యంగా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. కానీ అనుకున్న స్థాయిలో ఈ సినిమా ఆడలేకపోయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కేవలం 36 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇలా థియేటర్ల వద్ద ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా అటు ఐశ్వర్యతో పాటు ఇటు రజినీ కాంత్ కు తీవ్ర నిరాశను కల్గించింది. ఇలా థియేటర్లలోకి వచ్చిన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.

Super Star Rajini Kantha Recent Multi Starrer Movie Lal Salaam OTT Streaming Details Here

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన సన్ నెక్స్ట్ వేదికగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ ప్రియులకు అందుబాటులో ఉంచబోతున్నట్లు ఇటీవలే తెలిపింది. ఇలా ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 12వ రాబోతున్న ఈ చిత్రాన్ని ఇప్పటి వరకు మీరు చూసి ఉండకపోతే కచ్చితంగా చూసేయండి. రజినీ కాంత్ ఎలా చేశారు, ముఖ్యంగా ఐశ్వర్య డైరెక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X