OTT: మూవీ లవర్స్ గెట్‌ రెడీ... మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 650 కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ

ఓటీటీ లవర్స్ గెట్ రెడి.. 650 కోట్ల రూపాయల సినిమా ఓటీటీలోకి మరికొన్ని గంటల్లోకి రాబోతుంది. సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్రం ఈ ఆగస్టు 10న రిలీజ్ అయి సూపర్ హిట్టుగా నిలిచింది. దాదాపు 650 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమా ఈరోజు అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. అయితే అంతా ఈ సినిమా సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవనుంది అనకున్నారు. కానీ చివరి ఓటీటీ ఫ్లాట్ ఫాం మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజినీ కాంత్ పని అయిపోయింది.. ఏడు పదుల వయసులో ఆయనకు సినిమాలు అవసరమా అంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక ఆయన నటించిన జైలర్ సినిమా.. కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి సమాధానంగా నిలిచింది. ఆగస్టు 10న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఊచకోత కోసింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం... నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ.650 కోట్లు వసూలు చేసి.. అప్పటి వరకు ఉన్న రికార్డులు కొల్లగొట్టింది రజినీ జైలర్.

Super Star Rajinikanth Jailer Movie Going to Streaming on Amazon Prime Video OTT platform from Sept 7th

ఇక జైలర్ చిత్రంలో రజినీ సరనస అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ నటించింది. ఇక తమన్నా హీరోయిన్ గా నటించగా... శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ గెస్టులో రోల్ లో కనిపించారు. ఇక సునీల్, జాకీ ష్రాఫ్ వంటి వారు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

Super Star Rajinikanth Jailer Movie Going to Streaming on Amazon Prime Video OTT platform from Sept 7th

ఇక జైలర్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు.. చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. సన్ పిక్చర్ బ్యానర్ పై తెరకెక్కింది కాబట్టి ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవనుందని అంతా అనుకున్నారు. కానీ అనుహ్యాంగా ఈ సినిమా వేరే ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా నేటి అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Super Star Rajinikanth Jailer Movie Going to Streaming on Amazon Prime Video OTT platform from Sept 7th

సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి జైలర్ సినిమా ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. రజినీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించింది. అటు రజినీ కాంత్ కు కంబ్యాక్ ఇచ్చిన ఈ మూవీ బీస్ట్ సినిమాతో పరాజయం అందుకున్న నెల్సన్ కు కూడా సక్సెస్ ఇచ్చింది. ఇక రజినీ కాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తలైవా సినిమా రాబోతుందని హంగామా చేస్తున్నారు.

Super Star Rajinikanth Jailer Movie Going to Streaming on Amazon Prime Video OTT platform from Sept 7th

ఇక జైలర్ సినిమాకు కాసుల వర్షం కురవడంతో చిత్ర నిర్మాత కళానిధి మారన్... హీరో రజనీ కాంత్ కు,, డైరెక్టర్‌ దిలీప్‌ కుమార్‌, మ్యూజిక్‌ డైరెక్టర్లకు క్యాష్‌ చెక్‌లతో పాటు ఖరీదైన లగ్జరీ కార్లు గిఫ్టులుగా ఇచ్చారు. ఇక తాజాగా అపోలో ఆస్పత్రికి కూడా కోటి రూపాయల విరాళం అందించారు కళానిధి మారన్. మీరు గనుక థియేటర్లలో ఈ మూవీ మిస్ అయితే గనుక ఓటీటీలో తప్పకుండా చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X