OTTలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆ సినిమా.. 2 నెలలుగా ట్రెండింగ్‌లోనే!

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాల్లో రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఒకటి. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో వసూళ్లు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రికార్డులు సృష్టిస్తుంది. అంతే కాదు.. 2 నెలలుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ... టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అంతలా ఈ సినిమా ప్రేక్షకులకు రీచ్ అవడానికి కారణం ఏంటనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఏడు పదుల వయసులో కూడా సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమాలు చేస్తూ.. తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. నీకు సినిమాలు ఎందుకు రీటైర్ అయిపోవచ్చుగా అన్న నోర్లను తన తాజా సినిమా జైలర్ తో నోరు మూయించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్దకు వచ్చి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. మరోసారి తలైవా సత్తా ఏంటో చూపించింది.

Super Star Rajinikanth Movie Jailer has been Trending for two months on Amazon Prime Video

ఇక ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చాలా ఏళ్ల తర్వాత రమ్యకృష్ణ.. రజినీ కాంత్ సరసన నటించారు. ఇక తమన్నా హీరోయిన్ గా నటించింది. అనిరుథ్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమా బీజీఎం నెట్టింట హల్ చల్ చేస్తునే ఉంటాయి. ఎవరికైనా ఎలివేషన్ ఇవ్వాలంటే.. ఈ సినిమా మ్యూజిక్ నే వాడుకుంటారు. అంతలా కనెక్ట్ అయిపోయింది.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 650 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ సినిమా కలెక్షన్లను లియో సైతం క్రాస్ చేయలేకపోయింది. ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఆ మధ్య అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను భారీ ధరకు విక్రయించింది. ఇక సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన 24 గంటల్లోనే రికార్డు మిలియన్స్ వ్యూస్ సాధించి ఓ రికార్డు క్రియేట్ చేసింది.

ఇక సెప్టెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యాయి. ఎన్ని చిత్రాలు వచ్చినా సరే.. జైలర్ మాత్రం టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమా రెండు నెలలుగా నాన్ స్టాప్ గా టాప్ 10 స్థానాల్లో ట్రెండ్ అవుతూ వస్తుంది. ఇలా జైలర్ సినిమా ఇండియాలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ సినిమా ఈ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకోలేదు. ఇక ఈ సినిమాను ఇంకా ప్రేక్షకులు ఓటీటీలో చూస్తున్నారు.

Super Star Rajinikanth Movie Jailer has been Trending for two months on Amazon Prime Video

జైలర్ చిత్రం ఇప్పటి వరకు అలా 8 వారాలుగా అవుతూ వస్తుంది. ఇక ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయినా ఈ సినిమా టాప్ 5లో కొనసాగుతూ ఉంది. ఇంకో నెల రోజులు ఇలాగే ట్రెండ్ అయితే అమెజాన్ ప్రైమ్ లో అత్యధిక వ్యూస్ ని సాధించిన సినిమాగా నెంబర్ 1 స్థానంలో జైలర్ నిలుస్తుంది. ప్రస్తుతం సౌత్ నుండి అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న సినిమాగా 'వకీల్ సాబ్' రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమా రికార్డును జైలర్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X