OTTలోకి మరో సరికొత్త థ్రిల్లర్ సిరీస్.. క్షణ క్షణం ఎగ్జైట్ అవుతూ అక్కడ చూసేయండి!
రోజురోజుకూ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. అందరూ చాలా థ్రిల్ ఇచ్చే సినిమాలనే ఎక్కువగా చూస్తున్నారు. ఈ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతలు కూడా ఎక్కువగా హార్రర్, థ్రిల్లర్ సినిమాలను తీసుకు వస్తూ సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నారు. ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓటీటీలోకి మరో సరికొత్త థ్రిల్లర్ సిరీస్ వచ్చేసింది. అయితే ఆ సిరీస్ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది వంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నిజజీవిత ఘటనల ఆధారంగా తీసిన ఈ వెబ్ సిరీస్ పేరే "లూటేరే". రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభం అయిన ఈ వెబ్ సిరీస్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. ముఖ్యంగా ఈ సిరీస్ ను సోమాలియా పైరేట్స్ ఓ షిప్ ను హైజాక్ చేయడంతో కథ మొదలు అవుతుంది. అయితే దాన్ని వారి నుంచి ఎలా విడిపించారు, దానికోసం వారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు అన్నదే అసలు కథ. అయితే అదిరిపోయే థ్రిల్లర్ గా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ను జై మెహతా తెరకెక్కించారు.

రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, చందన్ రాయ్ సన్యాల్, ప్రీతికా చావ్లా వంటి వాళ్లు ప్రాధన పాత్రల్లో నటించారు. సముద్రపు దొంగల చుట్టూ తిరిగే ఈ సూపర్ థ్రిల్లర్ సిరీస్ ను తాజాగా ఓటీటీలో రిలీజ్ చేశారు. నిన్ననే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. అయితే మొత్తం 3ఎపిసోడ్ లు కల్గిన ఈ వెబ్ సిరీస్ ను.. ప్రస్తుతం రెండే రిలీజ్ చేశారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ లూటేరే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతం రెండు ఎపిసోడ్ లు మాత్రమే చూడొచ్చు. ఎంతో ఎగ్జైటింగ్ గా ఉండే మరో ఎపిసోడ్ మాత్రం ఐదు రోజుల తర్వాత అంటే మార్చి 28వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. అనుక్షణం విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కల్గింటే ఈ వెబ్ సిరీస్ రెండు ఎపిసోడ్లను ఇప్పడే చూసి మరో ఐదు రోజులు ఆగి మరీ చివరి ఎపిసోడ్ ను చూడొచ్చు. వీటిని చూసి దానికోసమే ఆగలేము అనుకునే వాళ్లు అప్పటి వరకు ఆగి అన్నీ వచ్చాక చూడడం బెటర్.

ఎలా చూసిన, ఎప్పుడు చూసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ ను మాత్రం కచ్చితంగా చూడండి. అస్సలే మిస్ కావొద్దు. అదిరిపోయే కథతో అనుక్షణం ఉర్రూతలూగించే ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా థ్రిల్లర్ కథలను ఇష్ట పడేవారికి నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











