OTT: హిందు అబ్బాయి - ముస్లిం అమ్మాయి.. ఓటీటీలో సూపర్ హిట్ 'లవ్ అండ్​ రివెంజ్'​ డ్రామా!

ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో సరికొత్త సూపర్ హిట్​ లవ్​ అండ్ రివెంజ్ డ్రామా సినిమా అందుబాటులోకి వచ్చింది. 1980 బ్యాక్​డ్రాప్​లో హిందూ అబ్బాయి - ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమ కథతో తెరకెక్కించారు. ఈ సినిమాను ఎందులో చూడాలో తెలుసుకుందాం..

మూవీ లవర్స్​కు వివిధ భాషల్లో సూపర్ హిట్​గా నిలిచిన సినిమా/సిరీస్​లను అందిస్తుంటాయి ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్​. ప్రతివారం ఏదో ఒక కొత్త కంటెంట్​తో ఎంటర్​టైన్మెంట్​ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. అలా ఈ వారం కూడా ఓ కన్నడ సూపర్ హిట్​ లవ్​ స్టోరీని తీసుకొచ్చాయి. అదే 'కైవా'. 1980 బ్యాక్​డ్రాప్​లో హిందూ అబ్బాయి - ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమ కథా నేపథ్యంతో చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్‌ 8న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుని సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను కూడా అందుకుంది.

Superhit Love story Kaiva Movie Streaming on Amazon Prime Video OTT FulL Details Here

ఆ ఓటీటీలోకే కైవా : ఇప్పుడీ చిత్రమే డిజిటల్ స్ట్రీమింగ్​కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దీని రైట్స్​ను కొనుగోలు చేసుకుని స్ట్రీమింగ్​కు వదిలింది. కానీ ప్రస్తుతానికి ఈ చిత్రం కన్నడ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ వెర్షన్‌కు ఇంగ్లిష్ సబ్‌ టైటిల్స్‌ ఉన్నాయి. త్వరలోనే తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులోకి రానుందని సమాచారం అందింది. కాబట్టి చూడాలనుకునేవారు ఇంగ్లీష్ సబ్​టైటిల్స్​తో చూసేయొచ్చు.

సినిమాలో ఎవరెవరు నటించారంటే ? ఈ కైవా చిత్రానికి జయతీర్థ జయన్న దర్శకత్వం వహించారు. రమేశ్ ఇందిర, దినకర్ తోగుదీప, నందా, జయరామ్ కార్తీక్, ఉగ్రం మంజు, రఘు, జాన్వీ రాయల ఇతర కీలక పాత్రల్లో నటించారు. కాంతార, విరూపాక్ష, మంగళవారం ఫేమ్​ అజ్నీశ్ లోకనాథ్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. హింస సన్నివేశాలు ఉన్నందున్న సెన్సార్​ బోర్డు ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చిందని తెలిసింది.

Superhit Love story Kaiva Movie Streaming on Amazon Prime Video OTT FulL Details Here

ఈ సినిమా కథేంటంటే ? రియల్​ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగానే 'కైవా' చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలిసింది. ఉద్యోగం కోసం ఓ మారుమూల గ్రామం నుంచి బెంగళూరు సిటీకి వస్తాడు కైవా (ధనవీర). ఆ తర్వాత ముస్లిం అమ్మాయి సల్మాతో(మేఘా శెట్టి) ప్రేమలో పడతాడు. అలా ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే కొంతమంది సల్మాను ఓ గ్యాంగ్‍స్టర్ ప్రియురాలు అనుకుని బాగా వేధిస్తారు. అనంతరం యాసిడ్‍తో కూడా దాడి చేస్తారు. దీంతో కైవా అదే గ్యాంగ్​స్టార్​ సాయంతో ఆ ముగ్గురిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలోనే సల్మాను పెళ్లి చేసుకుంటాడు. అనంతరం ఆమెపై యాసిడ్‌ తో దాడి చేసిన వారిని తరిమి ఇద్దరిని చంపేస్తాడు. కానీ ఆ తర్వాత పోలీసులకు చిక్కి జైలుకు వెళ్తాడు. మరి కైవా బయటకు వచ్చాడా? కైవా జైలుకు వెళ్లడంతో సల్మా జీవితం ఎలా మారిపోయింది? మూడో వాడిని కైవా చంపాడా? లేదా? అనేది తెలుసుకోవాలంటే 'కైవా' సినిమాను చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X