జగన్‌తో మీటింగ్‌పై బాలయ్య రియాక్షన్: చిరంజీవి చెప్పబట్టే అలా.. చాలా ఇబ్బంది పెట్టారంటూ!
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతూ.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరిస్తూ ముందుకు సాగుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న ఆయన.. గత ఏడాది 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' అనే షోతో హోస్టుగా మారారు. ఇందులోనూ తనదైన శైలి యాంకరింగ్‌తో ఆకట్టుకుని షోను సూపర్ హిట్ చేశారు. ఇక, ఇటీవలే మొదలైన రెండో సీజన్ తాజా ఎపిసోడ్‌లో గెస్టులుగా వచ్చిన నిర్మాతలతో బాలయ్య ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం!

రెండో సీజన్‌తో వచ్చిన బాలయ్య
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్టుగా వచ్చిన 'Unstoppable with NBK' టాక్ షో మొదటి సీజన్ భారీ స్పందనను అందుకుని సూపర్ హిట్ అయింది. దీంతో ఆహా టీమ్ ఇప్పుడు రెండో సీజన్‌ను అక్టోబర్ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. ఓటీటీ చరిత్రలోనే తొలిసారి ఈ షో కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించి కొత్త రికార్డును నమోదు చేశారు.

చంద్రబాబుతో మొదలుపెట్టారు
నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'Unstoppable with NBK 2' షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14న స్ట్రీమింగ్ చేశారు. దీనికి టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెస్టుగా వచ్చారు. దీనికి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సీజన్‌కు అదిరిపోయే ఆరంభం దక్కినట్లు అయింది.

యంగ్ హీరోలు.. స్నేహితులతో
'Unstoppable with NBK 2' షోలో భాగంగా రెండో ఎపిసోడ్‌కు టాలీవుడ్ యంగ్ హీరోలు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డలు హాజరయ్యారు. మూడో ఎపిసోడ్ కోసం శర్వానంద్, అడివి శేష్‌లు వచ్చారు. నాలుగో ఎపిసోడ్‌లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ప్రముఖ సినీ నటి రాధికలు వచ్చి యమ సందడి చేసేశారు.

ఈ ఎపిసోడ్‌లో ఫిల్మ్ మేకర్లు రాక
'Unstoppable with NBK 2' షోలో 5వ ఎపిసోడ్‌కు సంబంధించి.. తెలుగు సినీ ఇండస్ట్రీ 90 వసంతాలు పూర్తి చేసుకోవడంతో పాటు నందమూరి తారక రామారావు శత జయంతి ఏడాది కావడంతో ముగ్గురు సినీ ప్రముఖులు దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వచ్చారు. ఈ ఎపిసోడ్ ఇప్పటికే ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభం అయిపోయింది.

జగన్ మీటింగ్‌పై బాలయ్య ప్రశ్న
'Unstoppable with NBK 2' షోలో భాగంగా నిర్మాత సురేష్ బాబును నందమూరి బాలకృష్ణ 'టికెట్ రేట్లు, థియేటర్ల సమస్య అంటూ ఏవేవో పెట్టి ఆ మధ్య కోవిడ్ టైమ్‌లో మన ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా డిప్రెషన్‌లో పెట్టారు కదా. అప్పుడు చాలా మంది బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా బెజవాడకు కూడా వెళ్లొచ్చారు. మీరేంటి ఆ బ్యాచుల్లో లేరు' అంటూ సూటిగానే ప్రశ్నించారు.

అందుకే నేను దానికి వెళ్లలేదు
బాలయ్య ప్రశ్నకు సురేష్ బాబు 'అప్పుడు వాళ్ల నిర్ణయాన్ని నేను అంగీకరించలేకపోయాను. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. సినిమా అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. కొన్ని సినిమాలకు టికెట్ రేట్లు ఎక్కువ ఉండాలని నేను అనుకోను. అన్ని సినిమాలకు అందుబాటు ధరలోనే టిక్కెట్ రేట్లు ఉండాలి. ఆ ధరలతోనే మొత్తం కలెక్షన్ వచ్చేస్తుందని నేను నమ్ముతాను. అందుకే, ధరలు పెంచాలని అడుగుతున్నప్పుడు నేను వెళ్లి వాళ్లను బాధపెట్టడం ఇష్టం లేక వెళ్లలేదు' అని చెప్పారు.
చి

చిరంజీవి చెప్పబట్టే నేనంటూ
ఆ తర్వాత ఈ మీటింగ్‌లపై నిర్మాత అల్లు అరవింద్ కూడా మాట్లాడారు. 'మీటింగ్‌కు ముందు రోజు చిరంజీవి గారు నేను మాట్లాడుకున్నాం. అప్పుడాయన ''మీరు వెళ్తున్నారు కాబట్టి.. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎందుకు అని నేను ఆగిపోయాను'' అని చెప్పారు. అందుకే నేను వెళ్లి మాట్లాడాను' అని చెప్పారు. ఇలా ఈ సంభాషణ ఎంతో ఆసక్తికరంగా సాగింది.


Click it and Unblock the Notifications











