Kanguva OTT: ఓటీటీలోకి సూర్య పీరియాడికల్ యాక్షన్ డ్రామా..అఫీషియల్ డేట్ ప్రకటించిన కంగువా మేకర్స్..
Kanguva OTT: వైవిధ్యమైన పాత్రలు, విభిన్న కథాంశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం, వారి నుండి మన్ననలు పొందడంలో తమిళ స్టార్ హీరో సూర్య ఎప్పుడు ముందే ఉంటాడు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఇటీవల పిరియాడికి యాక్షన్ మూవీ కంగువతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో అట్రాక్ట్ చేయలేకపోయింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ కంగువా మూవీ ఓటీడీలో ఎప్పటినుండి స్ట్రీమింగ్ కానుంది?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ఆయనకు, ఆయన సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. హీరో సూర్య ఎంచుకునే పాత్రలు నటన ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సూర్య తాజాగా కంగువ మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమాకు డైరెక్టర్ శివ దర్శకత్వం వహించగా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ నిర్మించారు.

ఫాంటసీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్గా నటించగా బాబీ డియోల్, యోగి బాబు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. డైరెక్టర్ శివ ప్రేక్షకులను ఏకంగా 1000 ఏళ్లకు వెనకకి తీసుకువెళ్లారు. 1070 కాలంలో ఆటవీక తెగలను నేటి కాలానికి ముడిపెడుతూ ఈ సినిమాను రూపొందించారు. ఆనాటి కాలంలో ఆధిపత్యం కోసం జాతుల మధ్య వర్గాల మధ్య పోరు ఎలా సాగేది వర్గ పోరును ఆసరాగా చేసుకుంటూ విదేశీయాత్రికులు ఎలాంటి కుట్రలు పన్నారు. ఓ పోరాట యోధుడు విదేశీ కుట్రలను నుండి ఎలా ఎదుర్కొన్నారు? అనేది ఈ సినిమా కథ సైన్స్ ఫిక్షన్ అంశాలతో పాటు యాక్షన్ విజువల్ వండర్స్ తో కంగువా సినిమా తెరకెక్కింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని డిజాస్టర్ ను మిగిలించింది. ఇందులో సూర్య నటనకు మాత్రమే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. యాక్షన్ ఎపిసోడ్ లో తో పాటు కంగువ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి సీన్స్ రెండు కాలాల మధ్య కనెక్షన్ ను అర్థమయ్యేలా చెప్పడంలో డైరెక్టర్ కన్ఫ్యూజ్ అయ్యాడని చెప్పాలి. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడిందనే చెప్పాలి. మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 105 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇండియాలో రూ. 98 కోట్ల వసూలు చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కంగువా డిజిటల్ రైట్స్ ను ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది. రికార్డు స్థాయిలో రూ.100 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సినిమా ఒప్పందం ప్రకారం.. ఈ సినిమా విడుదలైన ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోవడంతో కేవలం నాలుగు వారాలలో డిజిటల్ ప్రైమ్ లో స్విమ్మింగ్ కు సిద్ధమైంది. దీంతో కంగువా సినిమా డిసెంబర్ 8 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నదని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది.


Click it and Unblock the Notifications











