OTTలోకి సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ... ఒక్కో సీన్​కు ఊపిరి బిగపట్టాల్సిందే!

ఓటీటీలోకి మరో సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. ఇప్పటికే ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలు, సిరీసులు సందడి చేస్తున్నాయి. ఇప్పుడు మరో రీసెంట్ మూవీ సందడి చేయబోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..? మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన 'మంజ్నుమ్మెల్ బాయ్స్'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 250కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. అసలు ఈ సినిమా కథేంటి..? అంతలా ఇందులో ఏం ఉంది..? ఇది ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది..? ఎప్పుడు అందుబాటులోకి రానుందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

మలయాళం సినిమాల్లో ఓ ఫీల్ ఉంటుంది. ఇటీవల కాలంలో వచ్చిన అన్నీ మలయాళ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రేమలు, భ్రమయుగం వంటి సినిమాలు ఎంత సూపర్ హిట్టుగా నిలిచాయో తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. అదే 'మంజ్నుమ్మెల్ బాయ్స్'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.. ఫిబ్ర‌వ‌రి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Survival Thriller Manjummel Boys Movie Telugu Version Streaming on Disney Plus Hotstar OTT From April 5th

మంజ్నుమ్మెల్ బాయ్స్ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు 'మంజుమ్మెల్ బాయ్స్' 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభంజనం సృష్టించింది. ఇక ఈ సినిమా తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ సైతం సూపర్‌ హిట్‌ గా నిలువగా... ఏప్రిల్ 4న ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయింది. ఇక తెలుగు ప్రేక్షకులను సైతం ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

మలయాళం, తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్టుగా నిలిచిన సర్వైవల్ థ్రిల్లర్ 'మంజ్నుమ్మెల్ బాయ్స్' సినిమా ఓటీటీలోకి రాబోతుంది. మొదట ఈ సినిమాకు ఓటీటీ వేదిక దొరకడం లేదంటూ వార్తలు రాగా... ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ ఖరారు అయినట్లు తెలుస్తోంది. 'మంజుమ్మేల్ బాయ్స్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేయగా.. ఈ సినిమాను ఓటీటీలో ఏప్రిల్ 5న విడుదల కానుందని సమాచారం. మరోవైపు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ మేలో అంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Survival Thriller Manjummel Boys Movie Telugu Version Streaming on Disney Plus Hotstar OTT From April 5th

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... యదార్థ సంఘటన ఆధారంగా సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. కోడైకెనాల్ లోని ఒక గుహను చూడటానికి కేరళ నుండి స్నేహితుల బృందం విహార యాత్రకు బయలుదేరుతారు. అయితే స్నేహితుల్లో ఒకరు గుహలో పడిపోగా.. అతన్ని ఎలా కాపాడుకున్నారు? వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఎలా బయటపడ్డారు అనేదే కథ. ఈ సినిమాలోని ప్రతి సీన్ కు ఊపిరి బిగపట్టాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X