OTTలోకి డబుల్ బ్లాక్ బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ - ప్రతీ సీన్ గుహల్లో ఉత్కంఠగా సాగుతూ!
ఓటీటీలో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఎన్నో భాషల, జానర్ సినిమాలు స్ట్రీమింగ్కు వస్తుంటాయి. కానీ అందరి చూపు ఎక్కువుగా మలయాళ సినిమాలపైనే ఉంటుంది. ఎందుకంటే ప్రేక్షకులను కేవలం ఎంటర్టైన్మెంట్ చేయడమే కాదు హృదయాలను దోచుకోవడం ఆ సినిమాల స్పెషాలిటీ. ఈ మధ్య రీసెంట్గా మాలీవుడ్ నుంచి భ్రమయుగం, ప్రేమలు వంటి సినిమాలు థియేటర్లలో వచ్చి భారీ బ్లాక్ బస్టర్లను అందుకున్నాయి. ఆ వెంటనే మంజుమ్మేల్ బాయ్స్ వచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. అలా వచ్చిన సినిమాలు వచ్చినట్లు రావడం హిట్ కొట్టడం రిపీట్ అన్నట్టుగా బాక్సాఫీస్ ముందు సందడి చేస్తున్నాయి.
ఇప్పుడీ చిత్రాలు ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో మమ్ముట్టి నటించిన భ్రమయుగం ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది. యూత్‌పుల్ లవ్ ఎంటర్టైనర్ ప్రేమలు కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్‌ను కూడా కన్ఫామ్ చేసుకుంది. ఇక ఇప్పుడు సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మేల్ కూడా ఓటీటీ విడుదలకు సిద్ధం కానుందని తెలుస్తోంది. అది కూడా తెలుగు వెర్షన్. అసలే ఇప్పటికే ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దీంతో ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను థియేటర్ రిలీజ్‌కు రెడీ చేశారు మేకర్స్. ఏప్రిల్ 6న థియేటర్స్‌లో తెలుగు వెర్షన్ విడుదల కానుంది. అంతలోనే ఓటీటీ రిలీజ్ డేట్ చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. దీనిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన పది రోజులకేే ఓటీటీలోకి విడుదల చేసేందుకు సదరు ప్లాట్ ఫామ్ సంస్థ సిద్ధమైనట్లు సమాచారం అందింది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
కాగా, ఈ మంజుమ్మేల్ బాయ్స్ ఓ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా. దీనికి చిదంబరం ఎస్ పొదువల్ డైరెక్ట్ చేశారు. గణపతి, సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, ఖలీద్ రెహమాన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో ఈ చిత్రం దాదాపు రూ.200కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నిజానికి ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.

2006 తమిళనాడు కొడైకెనాల్లోని గుణ గుహల్లో జరిగిన నిజ సంఘటన ఆధారంగానే దీన్ని తెరకెక్కించారు. కొంతమంది స్నేహితులు కలిసి గుణ గుహలను చూసేందుకు వెళ్తారు. అయితే వారిలో ఒకరు ప్రమాదవశాత్తు లోయలో పడిపోతారు. అయితే ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎందుకంటే పోలీసులు కూడా అతడిని కాపాడలేమని చేతులెత్తేశారు. కానీ మిగతా స్నేహితులు మాత్రం విశ్వప్రయత్నాలు చేసి పడిపోయిన ఆ ఫ్రెండ్‌ను చివరికి ఎలా కాపాడారనేదే మిగతా కథ. మరి మీరు కూడా ఈ సర్వైవల్ మూవీ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఓటీటీలోకి రాగానే ఎంచక్కా చేసేయండి.


Click it and Unblock the Notifications











