Paruvu on OTT ఓటీటీలో పరువుకు భారీ రెస్సాన్.. మెగా డాటర్ నిర్మించిన వెబ్ సిరీస్ ఎక్కడ చూడొచ్చంటే?
థియేటర్ లో వచ్చే సినిమాల కన్నా ఓటీటీ లో వచ్చే సిరిస్ లకే ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొత్త కొత్త కథలతో దర్శకులు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా ఈ శుక్రవారం రిలీజ్ అయిన పరువు అనే వెబ్ సిరిస్.. ఓటీటీలో దూసుకుపోతుంది. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం రండి.
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల.. కొన్నేళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్న విషయం తెల్సిందే. వరుసగా కాకపోయినా.. అప్పుడప్పుడు ఒక వెబ్ సిరిస్ తో నైనా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటుంది. తాజాగా ఆమె నిర్మించిన సిరీస్ పరువు. కోలీవుడ్ హీరోయిన్ లక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కు సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి దర్శకత్వం వహించారు.

కొన్నిరోజుల క్రితం నివేతా కారులో శవాన్ని పెట్టుకొని వెళ్తుందని పోలీసులు రోడ్డుపై కారు ఆపితే ఆమె నానా రచ్చ చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దాంతో ఆ వీడియో వైరల్ అయింది. అయితే అది పరువు అనే వెబ్ సీరీస్ ప్రమోషన్స్ కోసం ఆడిన చిన్న నాటకం అని తెలియగానే.. దానిపై బజ్ క్రియ్ అయింది. పరువు ప్రమోషన్స్ కోసమే అని ఈ సిరీస్ చూసినవారికి తెలుస్తుంది.
పరువు వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. పల్లవి (నివేతా పేతురాజ్) పెద్దలను ఎదురించి సుధీర్‌ను (నరేష్ అగస్త్య) ప్రేమవివాహం చేసుకుంటుంది. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుందనే కోపంతో పల్లవిని ఆమె తల్లిదండ్రులతో పాటు బంధువులు దూరం పెడతారు. రెండేళ్ల తరువాత పల్లవి పెదనాన్న చనిపోవడంతో కడసారి అతడిని చూసేందుకు భర్తతో కలిసి సొంత ఊరు బయలుదేరుతుంది. ఆ తర్వాత పలవి, సుధీర్ జీవితంలో ఏం జరిగిందనేది ఈ వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది.

మెగా డాటర్ సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి నిర్మించిన పరువు వెబ్ సిరీస్‌కు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో మంచి రెస్పాన్స్ వస్తున్నది. నటీనటుల పెర్ఫార్మెన్స్, యువ దర్శకుల టేకింగ్ గురించి చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ఈ సిరీస్ మంచి పాజిటివ్ టాక్ అందుకొని జీ5లో దూసుకుపోవడంతో చిత్ర యూనిట్ ఆనందంలో ఉంది.


Click it and Unblock the Notifications











