OTTలో ఆత్మలతో ఇన్వెస్టిగేషన్ మూవీ.. ఒక్కో సీన్‌కు గుండె దడ పెరగాల్సిందే!
ఓటీటీలు ఎన్నో రకాల జానర్ సినిమా సిరీస్‌లు వస్తుంటాయి. అలానే ఇతర భాషలకు చెందినవి కూడా వచ్చి అలరిస్తుంటాయి. వీటికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఈ మధ్య ఓటీటీ సంస్థలే స్వయంగా వీటిని నిర్మించేసి విడుదల చేసేస్తున్నాయి. అన్ని భాషల్లో డబ్ చేసి వదిలేస్తున్నాయి. అయితే మీరు ఇప్పటివరకు చాలా రకాల జాన్సర్స్ను చూసుంటారు? మరి ఆత్మలతో ఇన్వెస్టిగేషన్ చేసే సిరీస్‌ను చూశారా? హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్‌ను గత రెండేళ్లుగా బాగా అలరిస్తూనే ఉంది. ఇంతకీ ఆ సిరీస్ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? వంటి వివరాలను తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళితే.. ఓటీటీలో వచ్చిన ఎన్నో వెబ్ సిరీసుల్లో ఈ సిరీస్ కచ్చితంగా స్పెషల్ అనే అంటున్నారు ఆడియెన్స్. ఎందుకంటే మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను పంచుతోంది. దీని పేరే ది లాస్ట్ అవర్. ఈ సిరీస్‌లో సంజయ్ కపూర్, కర్మ తకాపా, షేలీ కే ప్రధాన పాత్రల్లో నటించారు. వీళ్ల నటన కట్టిపడేస్తోంది.

సూపర్ నేచురల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ 2021లో విడుదలైంది. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సగటున 30 నిమిషాల నిడివితో ఉత్కంఠగా సాగుతోంది. ఈ బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగా మెప్పిస్తున్నాయి. పోలీసు అధికారులకు దొరక్కుండా వరుసగా హంతకుడు మర్డర్లు చేయడం, వాడిని కనిపెట్టలేక, పట్టుకోలేక అధికారులు కింద మీద పడటం, జుట్టు పీక్కోవడం, దీంతో ప్రజలు తన ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని భయంభయంగా బతకడం.. అబ్బో ఇలా సిరీస్ మొత్తం ఇన్టెన్స్గా సాగుతూ మస్త్ థ్రిల్లింగ్ పంచుతోంది.

ఇంకా చెప్పాలంటే ఒక్కో ఎపిసోడ్‌కు ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెంచడం, ఆత్మలతో మాట్లాడుతూ కథను ముందుకు తీసుకెళ్లడం గూస్ బంప్స్‌ను తెప్పిస్తోంది. ముఖ్యంగా సంభాషణలు మరింత మెప్పిస్తున్నాయి. ఫైనల్‌గా మంచి ఎక్స్ పీరియన్స్ థ్రిల్ల్‌ను ఇస్తున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథేంటంటే? ముంబయిలో ఉండే పోలీసు అధికారి అరుప్(సంజయ్ కపూర్)ను ఓ బెంగాలీ నటి మర్డర్ కేస్ ఛేదించడం కోసం ఈశాన్య రాష్ట్రానికి బదిలీ చేస్తారు. అయితే అక్కడ వరుస హత్యలు జరగడం మొదలవుతాయి. ఎవరు? ఎందుకు చేస్తున్నారు? హంతకుడి మోటో ఏంటి అని తెలీక పోలీసులు సతమతమవుతుంటారు. ఈ క్రమంలోనే అరుప్ తనకు సాయంగా ఇన్వెస్టిగేషన్లోకి దేవ్(కర్మా తపాకా)ను జాయిన్ చేసుకుంటాడు. అయితే దేవ్‌కు ఒక అద్భుతమైన శక్తి ఉంటడం విశేషం.
అతడు లోకాన్ని వీడకుండా ఇక్కడే తిరుగుతూ ఉండే ఆత్మలతో మాట్లాడుతూ వారికి స్వేచ్ఛను కలిగించి తీరాలకు చేరుస్తుంటాడు. అలా వరుసగా జరుగుతున్న ఈ హత్యలకు సంబంధించి ఆత్మలతో మాట్లాడుతూ కేసును ఛేదించేందుకు రెడీ అవుతారు దేవ్, అరుప్. అయితే హత్యలు చేసేది కూడా ఒక సూపర్ నేచురల్ శక్తులు కలిగిన వారే అన్న అనుమానాలు రేకెత్తుతాయి. మరి ఈ ఆత్మల సాయంతో హంతుకుడిని పట్టుకున్నారా? కేసును ఛేదించారా? లేదా అన్నదే ది లాస్ట్ అవర్ సిరీస్ కథ.


Click it and Unblock the Notifications











