Swag OTT: శ్రీవిష్ణు నట విశ్వరూపం.. శ్వాగ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Swag OTT: తెలుగులో కంటెంట్ ఆఫ్ కింగ్‌గా పేరు తెచ్చుకొన్న హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం 'శ్వాగ్'. రాజ రాజా చోర దర్శకుడు హసిత్ గోలి లింగ వివక్షఅనే అంశానికి కామెడీని జోడించి తెరకెక్కించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 4వ తేదీ రిలీజైన ఈ సినిమాలో మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, రీతూ వర్మ, శరణ్య హీరోయిన్లుగా నటించారు. ఈ డిఫరెంట్ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.
శ్వాగ్ కథ విషయానికి వస్తే.. శ్వాగణిక వంశానికి చెందిన కోట్ల రూపాయల ఆస్తి కోసం భవభూతి (శ్రీవిష్ణు) వంశ వృక్ష నిలయానికి వస్తాడు. ఆ ఆస్తికి నిజమైన వారసులమంటూ సింగ(శ్రీవిష్ణు), అనుభూతి(రీతూ వర్మ)వస్తారు. ఈ ముగ్గురిలో శ్వాగణిక ఆస్తికి నిజమైన వారసులు ఎవరు? అనేది స్టోరీ. అలాగే.. 1551 ఏళ్ల క్రితం మాతృస్వామ్య వ్యవస్థ కోసం పోరాడిన వింజమర వంశ రాణి రుక్మిణి దేవి (రీతూ వర్మ) స్టోరీ ని కూడా ఇందులో జోడీంచారు. ఆ రాణి కలలకు భవభూతి (శ్రీ విష్ణు) ఎలా అడ్డు పడ్డారనేది స్వాగ్ మూవీ కథ.

ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీలో శ్రీవిష్ణు తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈమూవీలో హీరో శ్రీవిష్ణు ఏకంగా ఐదు పాత్రల్లో నటించి, మెప్పించారు. ఇక హీరోయిన్ రీతూ వర్మ కూడా ద్విపాత్రలో నటించింది ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసింది.ఇక మీరాజాస్మిన్, రవిబాబు, సునీల్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించి.. తమ పాత్రలకు న్యాయం చేశారు.
సమాజంలో ఆడ,మగ అనే భేదాలు లేకుండా అందరూ సమానమే అనే భావనను అత్యంత సున్నితంగా చూపించారు దర్శకుడు హసిత్ గోలి. ఇలాంటి విషయాన్ని కూడా కామెడీ జోనర్ గా తెరకెక్కిడం గ్రేట్ అనే చెప్పాలి. కాన్సెప్ట్ అంతా బాగున్నా.. సినిమాలో చాలా పాత్రలు ఉండటం, ఫ్లాష్‌బ్యాక్ కథలు కాస్త కన్ఫ్యూజన్ కు గురిచేశాయి. అలాగే.. కాస్త స్లో కథనం స్వాగ్‌కు మైనస్‌గా మారింది. ఈ మూవీలో శ్రీవిష్ణు నటనను విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇక శ్వాగ్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. అంటే.. నవంబర్ మొదటి వారంలో శ్వాగ్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్ అపేడ్ట్ ప్రకారం.. నవంబర్ 4 న తరువాత స్వాగ్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











