Swathi Muthyam OTT: ఆ ఓటీటీలో స్వాతి ముత్యం.. నెల కూడా కాకుండానే స్ట్రీమింగ్
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది వారసులు ఎంట్రీలు ఇస్తున్నారు. అలా ఇప్పటికే ఎంతో మంది స్టార్లు తమ కుమారులనో, కూతుళ్లనో హీరో, హీరోయిన్లుగా పరిచయం చేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ గతంలో తన పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్‌ను హీరోగా తీసుకు వచ్చారు. ఇక, ఇప్పుడు రెండో కొడుకు గణేష్ బాబును కూడా పరిచయం చేశారు. అతడు హీరోగా నటించిన చిత్రమే 'స్వాతి ముత్యం'. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ కే కృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. దీంతో ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి.
ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'స్వాతి ముత్యం' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకట్టుకోవడంతో దీన్ని దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అదే రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్', అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్' మూవీలు విడుదల ఉన్నా.. దర్శక నిర్మాతలు దీన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా 'స్వాతి ముత్యం' చిత్రానికి ఆశించిన వసూళ్లు దక్కలేదు.

థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయిన 'స్వాతి ముత్యం' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను విడుదలైన నాలుగు వారాల లోపే అంటే అక్టోబర్ 28వ తేదీ నుంచే ఆహా సంస్థలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటనను సదరు సంస్థ అధికారికంగా వదిలింది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులంతా ఆహాలో దీన్ని చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

వినూత్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'స్వాతి ముత్యం' మూవీలో బెల్లంకొండ గణేష్ బాబు - వర్ష బొల్లమ్మ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. రావు రమేష్, గోపరాజు రమణ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











