Swayambhu OTT: స్వయంభు ఓటీటీ డీల్‌పై ట్విస్ట్.. క్రేజీ ఆఫర్‌తో షాకిచ్చిన ఓటీటీ సంస్థ

2026లో టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ స్వయంభు. నిఖిల్ సిద్ధార్ధ్ హీరోగా నటిస్తుండగా సంయుక్త మీనన్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది నిఖిల్ కెరీర్‌లో 20వ సినిమా కావడం విశేషం. స్వయంభు చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. చారిత్రక కథాంశంతో విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అలాగే స్వయంభూ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్ అండ్ శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సుబ్బరాజు, సునీల్, సత్య తదితరులు స్వయంభులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరిస్తుండగా.. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. విజయ్ కామిశెట్టి సంభాషణలు అందించగా.. కింగ్ సొల్మొన్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సమ్మర్ కానుకగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, చైనీస్, స్పానిష్, అరబిబ్ భాషలలో స్వయంభూ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Swayambhu OTT Nikhil Siddhartha s Pan-India Epic Creates Buzz with Netflix s Performance-Based Deal

చారిత్రక కథాంశం, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. కొందరైతే మరో బాహుబలి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. టీజర్ తర్వాత చిత్ర యూనిట్ కాస్త సైలెంట్ అవ్వగా తిరిగి ఇటీవల ఫస్ట్ సింగిల్‌తో స్వయంభు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ పాటలోని విజువల్స్, సెట్టింగ్స్, గ్రాండీయర్ అన్ని కలిపి స్వయంభులో ఎంత విషయం ఉంది అన్నది ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నారు జనాలు. పాటకు తగినట్లుగానే సినిమా కూడా ఇదే రేంజులో ఉంటుందని భావిస్తున్నారు. నిజానికి స్వయంభు ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడింది. ప్రధానంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, సీజీ వర్క్స్ కారణంగానే లేట్ అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై త్వరలోనే క్లారిటీ రానుంది.

ప్రస్తుతం స్వయంభు మూవీ ఓటీటీ డీల్ చిత్ర పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడే నెట్‌ఫ్లిక్స్ ఓ షాకిచ్చింది. టాలీవుడ్‌లోనే తొలిసారిగా పర్ఫార్మెన్స్ బేస్డ్ నిబంధనను నిర్మాతల ముందు ప్రతిపాదించిందట. గతంలో సినిమా హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా రిలీజ్‌కు ముందే ఓటీటీ సంస్థలు భారీ రేటుకు ఆయా సినిమాల డిజిటల్ రైట్స్‌ను దక్కించుకునేవి. కానీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తుండటంతో ఓటీటీ సంస్థలకు భారీ నష్టాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే స్వయంభు విషయంలో నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది.

దీని ప్రకారం.. స్వయంభు చిత్రం థియేటర్లలో సాధించే నెట్ కలెక్షన్స్‌లో సగం మొత్తాన్ని డిజిటల్ రైట్స్ కింద నెట్‌ఫ్లిక్స్ తొలుత చెల్లిస్తుంది. ఉదాహరణకు స్వయంభు కానుక 100 కోట్ల రూపాయల నెట్ వసూలు చేస్తే 50 కోట్ల రూపాయలు దక్కుతాయన్న మాట. అలా ఎంత వసూలు చేస్తే అందులో సగం మొత్తం డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతకు దక్కనుంది. సినిమా కనుక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిస్తే నిర్మాతకు ఓటీటీపరంగా లాభాలు రాకపోవచ్చు. దీంతో నెట్‌ఫ్లిక్స్ ప్రతిపాదనపై నిర్మాతలు ఆచితూచి స్పందిస్తున్నారు. మరి దీనిపై స్వయంభు మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X