Mr. Pregnant OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి మిస్టర్ ప్రెగ్నెంట్.. అందుకే లేట్ చేశారా?

చాలా కాలం క్రితమే సినిమాల్లో వచ్చినా.. అంతగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయాడు సయ్యద్ సోహెల్ రియాన్. ఎప్పుడైతే బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అడుగు పెట్టాడో.. ఆ తర్వాత మాత్రం ఫుల్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నాడు. దీని తర్వాత ఏకంగా హీరోగా వరుస పెట్టి సినిమాలను కూడా చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. కానీ, ఇప్పటి వరకూ ఒక్క విజయాన్ని కూడా ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో సోహెల్ ఇటీవలే 'మిస్టర్ ప్రెగ్నెంట్' అనే సినిమాతో వచ్చాడు.

సయ్యద్ సోహెల్ హీరోగా శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కించిన చిత్రమే 'మిస్టర్ ప్రెగ్నెంట్'. తన భార్య పిల్లలు కనడానికే ఇష్టపడని ఓ వ్యక్తి.. ప్రకృతికి విరుద్ధంగా ప్రెగ్నెంట్ అవడం.. ఆ తర్వాత సమాజం నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం.. గర్భంతో ఉన్న సమయంలో చాలా సమస్యల్లో చిక్కుకోవడం వంటి అంశాలతో ఇది తెరకెక్కింది. మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి టాక్ పాజిటివ్‌గానే వచ్చింది. అందుకు తగ్గట్లే కలెక్షన్లు కూడా దక్కాయి. కానీ, బ్రేక్ ఈవెన్‌ను మాత్రం ఈ సినిమా చేరుకోలేకపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Syed Sohel Starrer Mr. Pregnant Movie Streaming on AHA From October 6th

థియేటర్లలో కొద్ది రోజుల పాటే సందడి చేసిన 'మిస్టర్ ప్రెగ్నెంట్' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించిన సమాచారంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఈ సినిమాను ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారన్నది కూడా సస్పెన్స్‌గా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సోహెల్ మూవీ ఓటీటీ డేట్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది.

విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'మిస్టర్ ప్రెగ్నెంట్' మూవీని అక్టోబర్ 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది. అంటే.. ఆగస్టు 18న విడుదలైన ఈ చిత్రం దాదాపు రెండు నెలలకు స్ట్రీమింగ్ చేసుకోబోతున్నట్లు అయింది. ఇక, ఈ చిత్రం ఆలస్యంగా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఓటీటీ సంస్థతో డీల్ లేట్ అవడమే అని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రకటనతో సోహెల్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Syed Sohel Starrer Mr. Pregnant Movie Streaming on AHA From October 6th

ఇదిలా ఉండగా.. 'మిస్టర్ ప్రెగ్నెంట్' మూవీలో రూపా కొడువాయూర్ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీని మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి, రవి రెడ్డి నిర్మించారు. దీనికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇందులో సుహాసిని, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, వైవా హర్ష, అభిషేక్‌లు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X