OTT: ఓటీటీలో గ్లామర్‌ బ్యూటీ అప్స‌ర రాణి మూవీ.. అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ స్టీమింగ్ ఎప్పుడంటే..?

రోజురోజుకు ఓటీటీల క్రేజ్ పెరుగుతోంది. థియేటర్లలో సినిమాలు చూసే వారికంటే.. ఓటీటీల్లోనే సినిమాలు, వెబ్‌సీరీలు స్ట్రీమింగ్ అవుతుండటంతో ఓటీటీల క్రేజ్ పెరుగుతోంది. దీంతో ఓటీటీ లవర్స్ ఆకట్టుకోవడానికి మూవీ మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలను తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సస్పెన్స్ థ్రిల్లర్, హారర్, కామెడీ, అడ్వెంచర్ థ్రిల్లర్ వంటి వివిధ జానర్ల సినిమాలు, వెబ్‌సీరీలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా హీరోయిన్ అప్సర రాణి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇంతకీ ఆ మూవీ ఏంటీ?

అప్సర రాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. ఈ సమయంలో 'ఉల్లాల ఉల్లాల' అనే చిన్న సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. కానీ, బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అనంతరం ఈ అమ్మడుపై రాంగోపాల్ వర్మ కన్నుపడింది. దీంతో ఆర్జీవీ ఈ అమ్మడుని హీరోయిన్ గా పెట్టి వరుసగా కొన్ని వెబ్ ఫిలిమ్స్ చేశారు. ఇలా రాంగోపాల్ వర్మ 'థ్రిల్లర్' అనే సినిమా టాలీవుడ్ పేక్షకులకు పరిచయమైంది. ఇలా అతి తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యింది.

Talakona OTT Apsara Rani s thriller Talakona is now streaming on Amazon Prime Video

ఆ తరువాత 'ఫోర్ లెటర్స్' అనే లేడీ ఒరియంట్ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత క్రాక్, సిటీమార్, హంట్ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మరింత పాపులర్ అయ్యింది. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'డేంజరస్' సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. ఆ తర్వాత ఆర్జీవీ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ 'ఢీ కంపెనీ' అనే మూవీలో ఓ నెంబర్ సాంగ్ చేసింది. ఇటీవలే 'రాచరికం' అనే సినిమాలో అప్సరరాణి కథానాయకగా నటిస్తోంది. కొద్ది వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. పొలిటీషియన్ గా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించింది.

ఇదెలా ఉంటే.. అప్సర రాణి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ తలకోన. ఈ మూవీలో అజయ్ ఘోష్, అశోక్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. న‌గేష్ నార‌దాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ గ‌త ఏడాది మార్చిలో థియేట‌ర్ల‌లో రిలీజైంది. అప్ప‌ర‌రాణి గ్లామ‌ర్‌, యాక్టింగ్ త‌ల‌కోన సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయి. ఐఎమ్‌డీబీలో 8.7 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది ఈ మూవీ.

Talakona OTT Apsara Rani s thriller Talakona is now streaming on Amazon Prime Video

తలకోన సినిమాలో అప్ప‌ర‌రాణి తన గ్లామ‌ర్‌, యాక్ష‌న్ తో రెచ్చిపోయింది. రిస్కీ ఫైట్ సీక్వెన్స్‌ల‌లో కూడా అప్ప‌ర‌రాణి న‌టించింది. ఈ థ్రిలర్ మూవీ ఓటీటీలోకి స‌డెన్‌గా వ‌చ్చింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా శ‌నివారం( ఫిబ్రవరి 9) నాడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రత్యేక్షమైంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంట‌ల్ విధానంలో విడుద‌లైంది. 99 రూపాయ‌లు రెంట‌ల్ ఛార్జెస్‌గా ఫిక్స్ చేశారు. థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌ది నెల‌ల త‌ర్వాత త‌ల‌కోన ఓటీటీలోకి వ‌చ్చింది.

More from Filmibeat

Read more about: talakona apsara rani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X