Aakhri Sach: మరో ఓటీటీ సిరీసుతో తమన్నా.. సంచలనం సృష్టించిన రియల్ స్టోరీతో 'ఆఖరి సచ్'

స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల జైలర్ సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ఆమె చేసిన కావాలయ్యా పాటకు బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కంటే ముందు తమన్నా ఎక్కువగా ఓటీటీ వెబ్ సిరీసులు, సినిమాలు చేసింది. వాటిలో ఎన్నడూ చూడని విధంగా ఘాటు రొమాంటిక్ సీన్లలో నటించి ప్రేక్షకులకు ఊపిరాడనివ్వకుండా చేసింది. ఇప్పుడు మరోసారి అంతకు మించి అలరించేందుకు సరికొత్త ఓటీటీ వెబ్ సిరీస్ 'ఆఖరి సచ్'తో (Aakhri Sach Web Series) రానుంది.

అలా క్రేజ్: శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గ్లామరస్ బ్యూటి తమన్నా.. హ్యాపీ డేస్ మూవీతో సూపర్ హిట్ కొట్టింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఎవరికీ దక్కని క్రేజ్ సంపాదించుకుంది. యూత్ కు క్రష్ గా మారిపోయింది ఈ మిల్కీ భామ. దీంతో ఆమెకు తెలుగులో కుప్పలుతెప్పలుగా వరుస అవకాశాలు రావడం మొదలైంది.

Tamanna

మాసివ్ హిట్: కొంచెం ఇష్టం కొంచె కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, తడాఖా, బద్రీనాథ్, బాహుబలి: ది బిగినింగ్, బెంగాల్ టైగర్, ఊపిరి, బాహుబలి: ది కన్‌క్లూజన్, F2, సైరా నరసింహా రెడ్డి వంటి చిత్రాలతో అలరించింది గ్లామరస్ బ్యూటి తమన్నా. ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్లలో సుమారు 73కిపైగా చిత్రాల్లో నటించి అలరించిన ఈ సుందరి ఇటీవల జైలర్ మూవీతో మాసివ్ హిట్ కొట్టింది. కానీ, భోళా శంకర్ మూవీతో ప్లాప్ అందుకుంది.

రొమాంటిక్ సీన్స్: ఇక ఇటీవల ఓటీటీ వెబ్ సిరీసులతో తెగ పాపులర్ అయింది మిల్కీ బ్యూటి తమన్నా. జూన్ 15న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జీ కర్దా (Jee Karda) అనే వెబ్ సిరీసులో శృతిమించిన శృంగార సన్నివేశాలతో తమన్నా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అలాగే జూన్ 29న నెట్ ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ 2తో (Lust Stories 2) ఆ హీట్ ఇంకాస్తా పెంచేసింది.

Tamanna

మర్డర్ ఇన్వెస్టిగేషన్: జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 కంటే ముందు తమన్నా 11th Hour (Aha), నవంబర్ స్టోరీ (November Story-Disney Plus Hotstar), బబ్లీ బౌన్సర్ (Babli Bouncer/Hotstar) సిరీసులు, సినిమాతో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మిల్కీ సుందరి.

రియల్ స్టోరీ: తమన్నా తాజాగా నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ 'ఆఖరి సచ్' (Aakhri Sach). 2018లో న్యూ ఢిల్లీ బురారి ప్రాంతంలో జరిగిన 11 మంది ఆత్మహత్యలు (Burari Deaths) సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ రియల్ స్టోరీతో ఆఖరి సచ్ తెరకెక్కించారు. 11 మరణాలు, ఎన్నో రహస్యాలు అంటూ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో తమన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించనుంది.

ఆగస్ట్ 25 నుంచి: కాగా ఆఖరి సచ్ సిరీసుకు రాబీ గ్రేవెల్ దర్శకత్వం వహించగా.. నిర్వికార్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. అభిషేక్ బెనర్జీ, దనిష్ ఇక్భాల్, శివిన్ నారంగ్, నిషా దీక్షిత్, క్రితి విజ్, సంజీవ్ చోప్రా తదితరులు నటించారు. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్ట్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఆఖరి సచ్ ట్రైలర్ (Aakhri Sach Trailer) ఆసక్తిగా ఉండటంతో వైరల్ అవుతోంది. ఇక ఇంతకాలం గ్లామర్ తో సూపర్ ట్రీట్ అందించిన తమన్నా ఇప్పుడు సీరియస్ గా మర్డర్ మిస్టరీని చేధించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X