తమన్నా లస్ట్ స్టోరీస్ 2 టీజర్.. ఈసారి కూడా రొమాంటిక్ టచ్ గట్టిగానే..
హిందీలో కియరా అద్వానీ నటించిన లస్ట్ స్టోరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా లస్ట్ స్టోరీస్ 2 నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇక ఈ మూవీకి సంబందించిన టీజర్ ని తాజాగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. నాలుగు భిన్నమైన కథలతో నడిచే అంథాలజీ ఫిల్మ్ గా ఈ లస్ట్ స్టోరీస్ సిరీస్ నడుస్తోంది. బాంబే టాకీస్ కి కొనసాగింపుగా లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ వస్తోంది.
ఇక తాజాగా రిలీజ్ అవుతున్న లస్ట్ స్టోరీస్ 2 లో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ, అమృత సుభాష్, అంగద్ బేడీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో కూడా నాలుగు భిన్నమైన కథలని ప్రేక్షకులకి చూపించబోతున్నారు. ఇక ఈ నాలుగు కథలని అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, ఆర్ బాల్కి, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. జూన్ 29న ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

ముఖ్యంగా మహిళల దృక్కోణం నుంచి ఈ లస్ట్ స్టోరీస్ కాన్సెప్ట్ లని టీజర్ లో ఎలివేట్ చేశారు. ఇక ఈ సిరీస్ లో తమన్నా, విజయ్ వర్మ రొమాన్స్ హైలైట్ అని చెప్పాలి. లివింగ్ రిలేషన్ లో ఉన్న కపుల్స్ గా తమన్నా, విజయ్ వర్మ కనిపిస్తున్నారు. ఇక మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతూ సంబంధాలు చూస్తున్న మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తోంది.
గత కొంతకాలంగా తమన్నా, విజయ్ వర్మ రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం నడుస్తోంది. తరుచుగా వీరిద్దరూ కలిసి మీడియాకి చిక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అంటూ బిటౌన్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇద్దరు కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తమన్నా, విజయ్ వర్మ జంట మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ వెబ్ సీరీస్ లలో రొమాంటిక్ టచ్ కూడా గట్టిగానే ఉండే అవకాశం ఉందట.
ఇక బాలీవుడ్ లో ఇలాంటి అడల్ట్ కంటెంట్ మూవీస్, వెబ్ సిరీస్ కి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. వెస్ట్రన్ కల్చర్ తో పాటు ఇండియన్ కల్చర్ లోని రూట్ లెవల్ లోకి వెళ్లి అడల్ట్ కంటెంట్ ని దర్శకులు ప్రెజెంట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ 2 తో తనకి బ్రేక్ వస్తుందని తమన్నా కూడా చాలా హోప్స్ పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











