OTT: ఓటిటిలోకి వచ్చిన తమన్నా, రాశీ ఖన్నా హార్రర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?

మన ఇప్పుడిప్పుడే సీక్వెల్స్ పర్వం మొదలయ్యింది. చాలా సినిమాలు సీక్వెల్స్ వచ్చేస్తున్నాయి అని చూస్తూనే ఉంటాం. దాదాపు అన్ని ఇండస్ట్రీ లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నవి భారీ చిత్రాలు వీటి కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సీక్వెల్స్ ఏమి మన ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు మొదలైన ట్రెండ్ అయితే అసలు కానే కాదు. ఎప్పుడు నుంచో సీక్వెల్స్ ఉన్నాయి.

అందులోని తమిళ సినిమా నుంచి కూడా ఎక్కువే ఉన్నాయి. మెయిన్ గా హీరో సూర్య నటించిన యముడు సిరీస్ అయితేనేమి దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ చేసే హారర్ కామెడీ సిరీస్ ముని, కాంచన అయితేనేం వీటితో పాటుగా తమిళ్ నుంచి మరో హారర్ కామెడీ ఫ్రాంచైజ్ ఉంది. అదే "అరణ్మణై" ఫ్రాంచైజ్. కాగా ఈ చిత్రాలని దర్శకుడు నటుడు సుందర్ సి తెరకెక్కిస్తున్నాడు.

Tamannaa and raashi khanna aranmanai 4 baak movie is now in ott

పైగా ఇవి కూడా లారెన్స్ సినిమా లానే తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా విడుదల చేస్తూ వచ్చారు. ఇంకొన్ని డీటెయిల్స్ చూస్తే మొదటి సినిమా అరణ్మణై 1 తెలుగులో 2014లో "చంద్రకళ" గా రిలీజ్ అయ్యింది. ఇందులో రాయ్ లక్ష్మి, ఆండ్రియా జెరెమియా నటించింది. అలాగే పార్ట్ తెలుగులో "నాయకి" గా వచ్చింది ఇందులో సిద్ధార్థ్, త్రిష లు నటించారు అలాగే టాలీవుడ్ నటులు కూడా నటించారు. ఇది 2016 లో వచ్చింది.

ఇక మూడో పార్ట్ "అంతఃపురం" పేరిట ఆర్య హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది 2021లో విడుదల అయ్యింది. మరి ఫైనల్ గా వీటికి మించి చేసిన సినిమానే "బాక్". అరణ్మణై 4 అంటూ వచ్చిన ఈ సినిమాలో గ్లామ్ షో ని అయితే సుందర్ బాగా దట్టించాడు అని చెప్పాలి. రాశి ఖన్నాతో పాటుగా మిల్కి బ్యూటీ తమన్నా ని కూడా యాడ్ చేసి అదిరే సాంగ్స్ తో ఆడియెన్స్ కి మంచి ఫీస్ట్ ఇచ్చాడు.

Tamannaa and raashi khanna aranmanai 4 baak movie is now in ott

కాకపోతే ఈ సినిమా తెలుగులో అనుకున్నంత సక్సెస్ కాలేదు కానీ డల్ గా ఉన్న కోలీవుడ్ లో మంచి వసూళ్లు సాధించి అదరగొట్టింది. హారర్ ఎలిమెంట్స్ తో పాటుగా తమన్నా, రాశీ ఖన్నాలు కూడా తమ గ్లామరస్ షో తో మంచి ఫీస్ట్ ని అందించారు. కాగా ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమాని మొదట ఎవరూ తీసుకోని సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేశారు.

కాగా ఇందులో ఈ సినిమా ఈరోజు జూన్ 21 నుంచి పాన్ ఇండియా భాషలు తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ మరియు మళయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మంచి హారర్ అలాగే కామెడీ అంతకు మించి మంచి గ్లామరస్ ట్రీట్ కావాలి అనుకునేవారు అప్పుడు థియేటర్స్ లో చూడకుండా ఓటిటిలో చూడాలి అనుకునేవారు హాట్ స్టార్ లో ఈ సినిమా ఉంది ఒక లుక్కేయవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X