Tamannaah Bhatia Bubbly Bouncer Trailer:కండోమ్‌లు కొంటున్న తమన్నా.. ఛాలేంజింగ్‌గా తీసుకొని..
హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మధుగా చెరిగిపోని ముద్ర వేసుకుంది మిల్కీ బ్యూటి తమన్నా. ఇటీవల ఎఫ్3 మూవీతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఇటు సౌత్.. అటు బాలీవుడ్లో అవకాశాలతో దూసుకుపోతోంది ఈ భామ. అయతే హిందీలో మాత్రం ఆశించినంత హిట్ ఇంతవరకు పడలేదు. అయతే తాజాగా బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన బబ్లీ బౌన్సర్ సినిమా ద్వారా తన లక్‌ను పరీక్షుంచుకోనుంది తమన్నా. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

సరికొత్త లుక్‌లో..
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ డైరెక్షన్లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బబ్లీ బౌన్సర్. ఈ మూవీ బాక్సర్ టౌన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అసోలా ఫతైపూర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్లో తమన్నా సరికొత్త లుక్స్‌తో ఆకట్టుకుంది. అబ్బాయిలా ఊర్లో తిరిగే యువతిగా తమన్నా కనిపిస్తుంది.

ఓటీటీ వేదికగా..
అలాగే ఏమాత్రం బెరుకు లేని యువతిగా తమన్నా నటన ఆకట్టుకునేలా ఉంది. కండోమ్‌లు ఇవ్వండి రెండు అని చెప్పే సీన్ నవ్వు తెప్పించేలా ఉంది. ఆద్యంతం కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది బబ్లీ బౌన్సర్ ట్రైలర్. అయితే ఈ మూవీని థియేటర్లకు బదులు నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు దర్శకనిర్మాతలు. తమన్నా లేడీ బౌన్సర్‌గా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
గత చిత్రాలకు భిన్నంగా..
బబ్లీ బౌన్సర్ మూవీ హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 23 నుంచి డిస్లీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ముందుగా థియేటర్లో విడుదలై బాలీవుడ్లో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకుందామనుకుంది తమన్నా. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో తాను తెరకెక్కించిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని డైరెక్టర్ మధుర్ భండార్కర్ తెలిపారు.
ఛాలెంజింగ్‌గా రోల్..
కెరీర్లో తొలిసారిగా ఓ బౌన్సర్ పాత్రలో కనిపించడం చాలా సంతోషంగా ఉందని తమన్నా పేర్కొంది. ఈ రోల్‌ను ఓ ఛాలెంజ్‌గా తీసుకుని నటించినట్లు వెల్లడించింది. అలాగే మధుర్ భండార్కర్ దర్శకత్వంలో నటించడం తొలిసారి అని, చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సరసన భోళాశంకర్ చిత్రంలో హీరోయిన్గా తమన్నా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా సత్యదేవ్‌తో గుర్తుందా శీతకాలం మూవీ కూడా చేసింది.


Click it and Unblock the Notifications











