twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Tamannaah Bhatia Bubbly Bouncer Trailer:కండోమ్​లు కొంటున్న తమన్నా.. ఛాలేంజింగ్​గా తీసుకొని..

    |

    హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మధుగా చెరిగిపోని ముద్ర వేసుకుంది మిల్కీ బ్యూటి తమన్నా. ఇటీవల ఎఫ్​3 మూవీతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్​టైన్​ చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఇటు సౌత్.. అటు బాలీవుడ్​లో అవకాశాలతో దూసుకుపోతోంది ఈ భామ. అయతే హిందీలో మాత్రం ఆశించినంత హిట్​ ఇంతవరకు పడలేదు. అయతే తాజాగా బాలీవుడ్​ పాపులర్ డైరెక్టర్​ మధుర్​ భండార్కర్​ దర్శకత్వంలో తెరకెక్కిన బబ్లీ బౌన్సర్ సినిమా ద్వారా తన లక్​ను పరీక్షుంచుకోనుంది తమన్నా. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

    సరికొత్త లుక్​లో..

    సరికొత్త లుక్​లో..

    బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్​ డైరెక్షన్​లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బబ్లీ బౌన్సర్​. ఈ మూవీ బాక్సర్ టౌన్​గా గుర్తింపు తెచ్చుకున్న అసోలా ఫతైపూర్​ బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్​లో తమన్నా సరికొత్త లుక్స్​తో ఆకట్టుకుంది. అబ్బాయిలా ఊర్లో తిరిగే యువతిగా తమన్నా కనిపిస్తుంది.

    ఓటీటీ వేదికగా..

    ఓటీటీ వేదికగా..


    అలాగే ఏమాత్రం బెరుకు లేని యువతిగా తమన్నా నటన ఆకట్టుకునేలా ఉంది. కండోమ్​లు ఇవ్వండి రెండు అని చెప్పే సీన్ నవ్వు తెప్పించేలా ఉంది. ఆద్యంతం కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది బబ్లీ బౌన్సర్​ ట్రైలర్​. అయితే ఈ మూవీని థియేటర్లకు బదులు నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు దర్శకనిర్మాతలు. తమన్నా లేడీ బౌన్సర్​గా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో విడుదల కానుంది.

    గత చిత్రాలకు భిన్నంగా..

    బబ్లీ బౌన్సర్​ మూవీ హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్​ 23 నుంచి డిస్లీ ప్లస్​ హాట్ స్టార్​లో స్ట్రీమింగ్​ కానుంది. అయితే ముందుగా థియేటర్​లో విడుదలై బాలీవుడ్​లో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకుందామనుకుంది తమన్నా. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో తాను తెరకెక్కించిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని డైరెక్టర్​ మధుర్ భండార్కర్​ తెలిపారు.

    ఛాలెంజింగ్​గా రోల్​..

    కెరీర్​లో తొలిసారిగా ఓ బౌన్సర్​ పాత్రలో కనిపించడం చాలా సంతోషంగా ఉందని తమన్నా పేర్కొంది. ఈ రోల్​ను ఓ ఛాలెంజ్​గా తీసుకుని నటించినట్లు వెల్లడించింది. అలాగే మధుర్​ భండార్కర్​ దర్శకత్వంలో నటించడం తొలిసారి అని, చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే మరోవైపు మెగాస్టార్​ చిరంజీవి సరసన భోళాశంకర్​ చిత్రంలో హీరోయిన్​గా తమన్నా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా సత్యదేవ్​తో గుర్తుందా శీతకాలం మూవీ కూడా చేసింది.

    English summary
    Heroine Tamannaah Bhatia And Director Madhur Bhandarkar Movies Bubbly Bouncer Telugu Trailer Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X