Tamannaah Bhatia: డైరెక్ట్ ఓటీటీలోకి వస్తున్న తమన్నా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పడంటే?

Sikandar Ka Muqaddar OTT: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మిక్కీ బ్యూటీ భాషతో సంబంధం లేకుండా పలు సినిమాల్లో నటిస్తుంది. సిని ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఓటీటీలో కూడా అగుడుపెట్టి తన సత్తా చాటుకుంది. తాజాగా ఓ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఈ మూవీ థియేటర్లలో విడుదల కాకుండా.. ఓటీటీలో నేరుగా విడుదలవుతోంది. ఇంతకీ ఆ మూవీ ఏంటీ? ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పడంటే?

అదే.. తమన్నా లీడ్ లో నటించిన మూవీ సికందర్ కా ముఖద్దర్ (Sikandar Ka Muqaddar). ఈ మూవీకి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. సికందర్ కా ముఖద్దర్‌లో తమన్నా భాటియా, అవినాష్ తివారీ, జిమ్మీ షెర్గిల్, రాజీవ్ మెహతా, దివ్య దత్తా, జోయా అఫ్రోజ్ నటించారు. నటి టబు, అజయ్ దేవగన్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఔరోన్ మే కహన్ దమ్ థా'కి కూడా నీరజ్ పాండే దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Tamannaah Bhatia Film Sikandar Ka Muqaddar Ott Sream On Netflix On 29 November 2024

సికందర్ కా ముకద్దర్ స్టోరీ విషయానికి వస్తే.. 'సికందర్ కా ముఖద్దర్' అనేది క్రైమ్ థ్రిల్లర్. 'స్పెషల్ 26', 'బేబీ', 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' వంటి చిత్రాలను రూపొందించిన సక్సెస్ పుల్ డైరెక్టర్ నీరజ్ పాండే రొమాంటిక్ క్రైమ్ థిల్లర్ కు దర్శకత్వం వహించారు. రూ.60 కోట్ల విలువైన వజ్రాన్ని ఎలా దొంగతనం చేశారు. దాన్ని వెతకడంతో పోలీసులు ఎలాంటి ఇబ్బందులు పడుతారు. ఇలా 15 ఏళ్ల పాటు సాగే ఈ కేసులో చివరికి ఏం జరుగుతోంది? ఆ కేసును పరిష్కరిస్తున్న పోలీసు ఆఫీసర్ చివరికి సక్సెస్ అవుతాడా? అన్నదే ఈ సినిమా. గతంలో ఖాకీ: ది బిహార్ ఛాప్టర్ లాంటి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అందించిన నీరజ్ పాండే.. దానికి రిలేటెట్ గా ఉన్న జానర్ లో ఈ మూవీని తెరకెక్కించారు.

ఇదెలా ఉంటే.. తమన్నా భాటియా తన అభిమానులకు కొత్త కానుక అందించనున్నారు. హీరోయిన్ తమన్నా నటించిన క్రైమ్ అండ్ థ్రిల్లర్ సికందర్ కా ముఖద్దర్ (Sikandar Ka Muqaddar) మూవీ డైరెక్ట్ గా OTTలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించింది. ఓ మోషన్ పోస్టర్ తో టైటిల్ రివీల్ చేసింది. తాజాగా ఈ సినిమా నవంబర్ 29నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. అయితే.. కేవలం హిందీలోనేనా.. తెలుగులో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ కానున్నదా అనే క్లారిటీ రాలేదు.

Tamannaah Bhatia Film Sikandar Ka Muqaddar Ott Sream On Netflix On 29 November 2024

ఇక తమన్నా భాటియా సినిమా విషయాలకు వస్తే..ఈ ఏడాది 'స్త్రీ 2' సినిమాలో కూడా ఓ ఐటమ్ సాంగ్ నటించి కుర్రకారును చెమటలు పట్టించింది. ఇక 'ఓదెల 2' అనే తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుంది. హెబ్బా పటేల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన హిట్‌ మూవీ 'ఓదెల రైల్వేస్టేషన్‌' (2021)కి సీక్వెల్‌గా 'ఓదెల 2' రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాసూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు అశోక్‌ తేజయే దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు కరణ్‌ జోహార్‌ బ్యానర్‌పై రూపొందుతున్న 'డేరింగ్‌ పార్ట్‌నర్స్‌'లో కూడా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X