Odela 2 Ott Release : ఓటీటీలోకి తమన్నా భాటియా ఓదెల 2.. ఎప్పుడు? ఎందులో
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా నటించిన చిత్రం ఓదెల2. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని అశోక్ తేజ డైరెక్ట్ చేశారు. కథను డైరెక్టర్ సంపత్ నంది అందించారు. ఈ చిత్రంలో తమన్నా భాటియాతో పాటు హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్రల్లో నటించారు. 2022లో వచ్చిన 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రానికి ఇది సీక్వెల్. సపంత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ బ్యానర్లలో సంయుక్తంగా నిర్మించారు. డీ మధు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఈరోజు ఏప్రిల్ 17న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది.
శివ శక్తి పాత్రలో తమన్నా భాటియా తొలిసారిగా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నారు. నాగసాధువుగా కనిపించి అలరించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ లో తమన్నా భాటియాను ఎంతో పవర్ ఫుల్ గా చూపించారు. తన నట విశ్వరూపంతో తమన్నా భాటియా ఆడియెన్స్ ను మెప్పించడం ఖాయమని అర్థమవుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై పాజిటి వ్ టాక్ ఉండింది. ఇక ఈసినిమాకు సినిమాటోగ్రఫీగా సౌందరరాజన్, మ్యూజిక్ డైరెక్టర్ గా అజనీష్ లోక్ నాథ్ వ్యవహరించారు. ఖర్చుకు వెనకాడకుండా భారీగానే వెచ్చించారు.

ఓదెల 2 చిత్రంలో ఓదెల మల్లన్న దేవుడు ఆ గ్రామాన్ని భూతాల నుంచి ఎలా రక్షిస్తాడనేది ఆ సినిమా సారాంశం. గ్రాండ్ విజువల్స్ తో సినిమా ఆకట్టుకుంటుంది. గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇక ఓటీటీ రిలీజ్ కు కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఓదెల 2 డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోవడం విశేషం. అయితే ఏ చిత్రమైనా థియేట్రికల్ రిలీజ్ తర్వాత 4 వారాలకు ఓటీటీలోకి వస్తుందనే నియమం తెలిసిందే. ఇక ఇటీవల టాక్ కాస్తా బెడిసికొడితే ముందుగానే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి.
కానీ, ఓదెల 2పై కాస్తా మంచి అంచనాలే ఉండటంతో సినిమా లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం ఉండింది. దీంతో సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనేది పక్కా డేట్ మాత్రం ప్రకటించాల్సి ఉంది.. మే చివరి వారంలో ఓటీటీలో చేరే అవకాశం ఉంది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 29 నిమిషాలు. సినిమాలోని వీఎఫ్ఎక్స్ వర్క్, నటీనటుల పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని ఎర్లీ రివ్యూస్ చెబుతున్నాయి. దీంతో టాక్ అదిరిపోతే మాత్రం చిత్రం బ్లాక్ బాస్టర్ పక్కా అని అంటున్నారు. మరి తమన్నా భాటియా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
మరోవైపు ఈ సినిమాలో తమన్నా భాటియా మేకప్ పూర్తిగా వాడకుండా, నేచురల్ గానే నటించినట్టు చెప్పుకొచ్చారు. ఆత్మకు పరమాత్మకు మధ్య జరిగే ఘర్షణే ఈ చిత్రమని చెప్పుకొచ్చారు. శివశక్తులు, నాగసాధువులుగా గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఇక తమన్నా ఈ తరహా పాత్రలో తొలిసారిగా అలరించబోతుండటం విశేషం. తెలుగులో చివరిగా మెగాస్టార్ చిరంజీవి సరసన 'భోళా శంకర్'లో నటించింది.


Click it and Unblock the Notifications











