ఓటీటీలోకి భయపెట్టే అందమైన దెయ్యాల సినిమా.. ఎప్పుడు, ఎక్కడ వస్తుందంటే!

భారతదేశ వ్యాప్తంగా ఉన్న చాలా భాషల్లో హర్రర్ స్టోరీలతో సినిమాలు రూపొందుతోన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి చిత్రాలకు గతంలో కంటే ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఈ తరహా మూవీలు మరింతగా రూపుదిద్దుకుంటున్నాయి. అలా కొద్ది రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన హర్రర్ సినిమానే 'అరణ్మనై 4' / 'బాక్'.

తమన్నా భాటియా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమే 'అరణ్మనై 4'. సుందర్ సీ కీలక పాత్రను పోషించడంతో పాటు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఆరంభంలోనే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తెరకెక్కించారు. ఇలా భారీ హైప్ నడుమ ఈ సినిమాను మే 3వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేసుకున్నారు.

Tamannaah Bhatia Raashii Khanna Starrer Aranmanai 4 Movie Streaming on Hotstar From June 21st

ఎంతో మంది స్టార్ల కలయికలో రూపొందిన 'అరణ్మనై 4' సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీనికి కారణం ఇందులో పాయింట్ పర్‌ఫెక్ట్‌గా ఉన్నా.. దాన్ని నడిపించిన విధానం ప్రేక్షకులను మెప్పించలేదు. ఫలితంగా ఈ చిత్రం ఆశించిన రీతిలో సక్సెస్ కాదని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా భారీ రెస్పాన్స్‌తో వంద కోట్లు వసూళ్లు రాబట్టి సత్తా చాటింది.

రూపాలు మార్చుకుంటూ భయపెట్టే దెయ్యం కాన్సెప్టుతో రూపొందిన మూవీ కావడంతో పాటు విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో 'అరణ్మనై 4' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి మంచి పోటీనే వస్తుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అత్యధిక ధరకు తీసుకుంది.

స్టార్ హీరోయిన్లు తమన్నా, రాశీ ఖన్నా నటించిన 'అరణ్మనై 4' మూవీని జూన్ 21 వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఈ మేరకు తాజాగా సదరు సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీనికి ఓ క్రేజీ పోస్టర్‌ను సైతం జోడించింది. ఇదిలా ఉండగా.. ఓటీటీలోకి వస్తున్న ఈ హర్రర్ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొందనే చెప్పాలి.

Tamannaah Bhatia Raashii Khanna Starrer Aranmanai 4 Movie Streaming on Hotstar From June 21st

ఇక, గ్లామరస్ హీరోయిన్ల కాంబినేషన్‌లో సుందర్ సీ తెరకెక్కించిన 'అరణ్మనై 4' మూవీని అవనీ సినీ మ్యాక్స్, బెంజ్ మీడియా బ్యానర్లపై ఖుష్బూ సుందర్, అరుణ్ కుమార్ నిర్మించారు. ఇందులో రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్, కోవై సరళ, యోగి బాబు తదితరులు నటించారు. ఈ చిత్రానికి హిప్‌ఆప్ తమీజా సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X