Tamannaah Bhatia హాట్ వెబ్ సిరీస్ ఓటీటీలో.. మిల్కీ బ్యూటీ మూవీ ఎక్కడ? ఎప్పుడు రిలీజ్ అంటే?

అందాల భామ, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియలో ట్రెండింగ్‌గా నిలుస్తున్నది. వరుస ప్రాజెక్టులతో ఓ వైపు బిజీగా ఉంటూనే.. మరో వైపు తన సినిమాలను రిలీజ్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటి వరకు గ్లామర్ తారగా రాణించిన తమన్నా భాటియా.. లేటేస్టుగా హాట్ హాట్ చిత్రాలతో యూత్‌ హృదయాల్లో సెగ రేపుతున్నది. తమన్నా స్పీడ్‌ చూసి ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు. తాజాగా ఆమె నటించిన జీ కర్దా వెబ్ సిరీస్ రిలీజ్ ఎప్పుడు? ఆ సిరీస్‌లో ఆమె గ్లామర్ ట్రీట్ వివరాల్లోకి వెళితే...

అనురిమ శర్మ దర్శకత్వంలో రూపొందిన జీ కర్దా వెబ్ సిరీస్‌ యూత్‌ ఫుల్, రొమాంటిక్, ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రం తమన్నా భాటియాతోపాటు సుహైల్ నాయర్, ఆశీమ్ గులాటీ, అన్య సింగ్ యువ నటీనటులు కీలక పాత్రలను పోషించారు. దినేష్ విజన్, ఆశీష్ నికమ్ నిర్మించిన ఈ సినిమాకు సచిన్ జిగర్ మ్యూజిక్ అందించారు.

 Tamannaah Bhatia

జీ కర్దా (Jee Karda) ట్రైలర్‌ను హాట్ హాట్‌గా సినీ ప్రేక్షకులకు వడ్డించారు. తమన్నా ఈ చిత్రంలో పలకించిన హవభావాలు రచ్చ చేశాయి. ఇక ఈ చిత్రంలోని పెళ్లికి ముందే సెక్స్ గురించి ఫ్యామిలీలో జరిగే చర్చ, చెప్పుకొనే డైలాగ్స్ మరింత బోల్డుగా అనిపించాయి. దాంతో తమన్నా భాటియా పోషించిన పాత్రపై భారీగానే చర్చ జరుగుతున్నది.

లవ్, ఎంటర్‌టైన్‌, ఎమోషనల్ అంశాలతో బోల్డుగా రూపొందించన జీ కర్దా (Jee Karda) చిత్రం ట్రైలర్ భారీ అంచనాలను పెంచింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 15వ తేదీన రిలీజ్ అవుతున్నది. అధికారికంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటన చేసింది. దాంతో ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

ఇక ఇదిలా ఉండే తమన్నా భాటియా లస్ట్ స్టోరిస్ 2లో హాట్ హాట్‌గా నటించడం మరోసారి సినీ వర్గాల కనుబొమ్మలు ఎగిరేలా చేసింది. కాజల్, నీనా గుప్తా, మృణాళ్ థాకూర్‌తో కలిసి నటించింది. ఇక వెబ్ సిరీస్‌లో తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఘాటైన సీట్లలో హాట్ హాట్‌గా నటించిందనేది ట్రైలర్ స్పష్టం చేసింది. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

 Tamannaah Bhatia

ఇక తమన్నా భాటియా సినిమాలో విషయానికి వస్తే.. దక్షిణాదిలో అగ్ర హీరోలతో జతకట్టింది ఈ మిల్కీ బ్యూటీ. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో జైలర్‌ షూటింగును ఇటివలే పూర్తి చేసుకొన్నది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X