OTT: వివాదాల్లో తమన్నా బాయ్ ఫ్రెండ్ లేటెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఎందులో చూడొచ్చంటే
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఓటిటిల వినియోగం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. కాగా ఇపుడు నెలకొన్న పోటీ ప్రపంచంలో ఒకో ఓటిటి తమ వినియోగదారులకి ఎలాగైనా మరింత ఎంగేజింగ్ కంటెంట్ ఇచ్చి పక్క ప్లాట్ ఫామ్ లకి వెళ్లకుండా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా మంచి కంటెంట్ ని అందిస్తూ వరల్డ్ వైడ్ గా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న వెబ్ ప్లాట్ ఫామ్ ఏదన్నా ఉంది అంటే అది నెట్ ఫ్లిక్స్ అని చెప్పాలి.
అనేక భాషల్లో సాలిడ్ కంటెంట్ ని ప్లాట్ ఫామ్ మన ఇండియాలో ఎక్కడా తగ్గదు. మంచి డిమాండ్ అండ్ క్రేజ్ ఉన్న భారీ సినిమాలని ఈ చిత్రమే దక్కించుకుంటుంది. ఇలా అందరిలో మంచి పాపులార్టీ తెచ్చుకున్న ఈ సంస్థకి కాంట్రవర్సీలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి అని చెప్పాలి. పలు షాకింగ్ సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లతో ఇప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటుంది.

కాగా గత రెండేళ్లలో స్టార్ బ్యూటీ నయనతార నటించిన చిత్రం "అన్నపూరణి" హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని భారీ ఎత్తుగా నెగిటివిటీ రావడంతో ఆ సినిమాని ఏకంగా నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా ఈ చిత్రం తర్వాత బాలీవుడ్ బిగ్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన చిత్రం "మహారాజ్" కి కూడా హిందూ సాధువుల నుంచి నెగిటివిటీ నెట్ ఫ్లిక్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇక ఇపుడు నెట్ ఫ్లిక్స్ మరోసారి వివాదాల్లో వైరల్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ లో పలు ఒరిజినల్ సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లని కూడా తీసుకొస్తారు. అలా టాలెంటెడ్ నటులు తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వెర్మ ముఖ్య పాత్రలో తమిళ నటుడు అరవింద స్వామి అలాగే నజీరుద్దీన్ షా లాంటి తారాగణంతో 1999 లో జరిగిన ఓ విమాన హైజాక్ ఆధార వెబ్ సిరీస్ కూడా వచ్చింది.

అదే "ఐసి 814 - కాందహార్ హైజాక్". కాగా ఈ సిరీస్ కొన్ని రోజులు కితమే నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది కానీ ఏదైతే ఈ సిరీస్ కాందహార్ హైజాక్ ఆధారంగా తీశారో ఇందులో తప్పుడు సమాచారాన్ని అందించారని భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడు హైజాక్ చేసింది ముస్లిం వ్యక్తులు అయితే ఇందులో ఏకంగా వారి మతాన్ని పేర్లని కూడా మార్చేసి ప్రస్తుత తరాలకి తప్పుడు సమాచారాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. దీనితో ఇలా మరోసారి నెట్ ఫ్లిక్స్ వివాదాల్లో ఇరుక్కుంది. మరి దీనిపై ఒక ముగింపు ఎలా ఉంటుందో చూడాలి. కాగా ఈ థ్రిల్లర్ సిరీస్ ని అనుభవ సిన్హా దర్శకత్వం వహించగా మొత్తం 6 ఎపిసోడ్స్ గా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతానికి అయితే మంచి రెస్పాన్స్ తోనే నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ అవుతూ దూసుకెళ్తుంది.


Click it and Unblock the Notifications











