సైలెంట్‌గా ఓటీటీలోకి ఓదెల 2.. తమన్నా భాటియా మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన ఓదెల 2 చిత్రం ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై కొన్ని వర్గాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. 2021 సంవత్సరంలో రిలీజై ఓటీటీలో భారీ విజయం అందుకొన్న ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది సమర్పణలో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డీ మధు నిర్మించారు.
నాగ సాధువుగా తమన్నా కనిపిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా సీక్రెట్‌గా గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఇంత త్వరగా ఓటీటీ స్ట్రీమింగ్ కావడానికి కారణం? అలాగే ఈ సినిమాను ఎక్కడ ఎప్పుడు చూడొచ్చంటే?

తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందిన ఓదెల 2 సినిమాను సుమారుగా 25 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమాపై భారీగా హైప్ పెరగడంతో బిజినెస్ పరంగా కూడా ఆసక్తి పెరిగింది. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 11 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరగడంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలోని ఓదెల గ్రామంలో జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీలో శివ శక్తి, నాగసాధువుగా తమన్నా నటించింది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా భారీగా నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు గ్రాండ్‌గా ఓపెనింగ్స్ సాధించింది. ఫస్ట్ డే ఈ చిత్రం 90 లక్షల రూపాయల నికర కలెక్షన్లు 2 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కానీ అదే జోష్‌ను ఆ తర్వాత కొనసాగించలేకపోయింది.
ఓదెల 2 సినిమా తెలుగులో 3.5 కోట్ల రూపాయల నెట్ 6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇక హిందీలో 35 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు 70 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 4 కోట్ల రూపాయల నెట్, 7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్‌గా నష్టాలను నమోదు చేయగా.. నాన్ థియేట్రికల్‌గా లాభాలను సాధించి పెట్టింది. థియేట్రికల్‌గా మెప్పించలేకపోయిన ఈ సినిమా నేరుగా హడావిడి లేకుండా ఓటీటీలో ప్రత్యక్షమైంది.
ఓదెల 2 సినిమా నిర్ణీత సమయం కంటే ముందుగానే ఓటీటీలకు రావడం సినీ వర్గాలకు షాకిచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ చిత్రం మే 8 తేదీన ఓటీటీలో రిలీజైంది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి రావడం వెనుక అమెజాన్ నిర్వాహకుల ఒత్తిడి కారణమనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది.
ఇటీవల కాలంలో సినిమా రిలీజ్ డేట్లను, ఓటీటీ రిలీజ్ డేట్ల విషయంలో ఓటీటీ సంస్థలు నిర్మాతలను, దర్శకులపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఓటీటీ సంస్థల ఆదేశాలు, సూచనల మేరకే రిలీజ్ డేట్లు, స్ట్రీమింగ్ డేట్లు డిసైడ్ అవుతున్నాయి. అందుకే ఓదెల 2 సినిమా కూడా అదే కారణంగా రిలీజై ఉంటుందనే అభిప్రాయాన్ని సినీ, ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











