This Week OTT Releases ఓటీటీలో రణ్‌బీర్ కపూర్, పంకజ్ త్రిపాఠి సినిమాలు.. ఏవేవీ రిలీజ్ అయ్యాయంటే?
ప్రతీ వారం వారం సినిమాలు తెరపైకి వస్తూ పోతుంటాయి. థియేటర్లో సందడి చేసిన సినిమాలు ఓటీటీలోకి వచ్చే సమయంలోనూ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. ఓటీటీలోకి సినిమాలు ఎప్పుడొస్తుంటయా? ప్రేక్షకుల ఎదురు చూస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ వారంలో ఓటీటీ, థియేటర్లోకి వచ్చిన చిత్రాల సినిమాల జాబితాపై ఓ సారి లుక్కేయండి..

ఓటీటీపై దృష్టి..
సినీ జనాలు ఇప్పుడు ఎక్కువగా ఓటీటీ మీద ఫోకస్ పెడుతున్నారు. థియేటర్లకు రావడం భారంగా భావిస్తున్నారు. టికెట్ రేట్లు, ట్రాఫిక్ సమస్యలు, థియేటర్లో దోపిడి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సినీ లవర్స్ ఎక్కువగా ఓటీటీనే నమ్ముకుంటున్నారు. కరోనా సమయంలో ఓటీటీ వాడకం మరింత ఎక్కువగా పెరిగింది. అందుకే జనాలు ఎక్కువగా థియేటర్ మొహాన్ని చూడటం లేదు. మంచి చిత్రాలు వస్తేనే థియేటర్‌లకు జనాలు క్యూ కడుతున్నారు.

అమెజాన్‌లో షంషేరా చిత్రం
బాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు డిజాస్టర్లు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చిన షంషేరా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణ్‌బీర్ కపూర్ నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ చిత్రంలో సంజయ్ దత్, వాణీకపూర్ నటించింది.

తమిళ్ రాకర్స్ వెబ్ సిరీస్..
ఇక సినిమా పరిశ్రమకు భూతంగా మారిన తమిళ్ రాకర్స్ పైరసీ సంస్థను టార్గెట్ చేస్తూ రూపొందించిన చిత్రం తమిళ్ రాక్స్. అరుణ్ విజయ్ నటించిన ది తమిళ్ రాకర్స్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో అందుబాటులో ఉంది. ఆద్యంత ఆసక్తిని రేపే థ్రిల్లర్ రూపొందిన ఈ చిత్రం సోని లీవ్‌లో అందుబాటులో ఉంది.

ఓటీటీలో దురంగ చిత్రం
ఆద్యంత ఆసక్తి రేపే థ్రిల్లర్‌గా రూపొందిన దురంగ చిత్రం ఓటీటీలో సందడి చేస్తున్నది. ఈ చిత్రంలో దృష్టి ధామీ, గుల్షన్ దేవయ్య నటించారు. ఈ చిత్రం జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ అవుతున్నది. హారర్, థ్రిల్లర్ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా ఈ వారాంతంలో చక్కటి అనుభూతిని కలిగించే చిత్రంగా ఉంటుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో ఉంది.

365 డేస్, హెవెన్ చిత్రాలు
ది నెక్స్ 365 డేస్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలో వచ్చిన హెవెన్ సినిమా ఆగస్ట్ 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ చిత్రంలో సిమ్ను సిజో, సుదేవ్ నాయర్ నటించారు. .

ఓటీటీలో పంకజ్ త్రిపాఠి చిత్రం
పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో రాబోతోన్న షెర్డిల్ ది ఫిలిబిట్ సాగా అనే చిత్రం నెట్ ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. శ్రీజిత్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం సందేశాత్మక ధోరణిలో సాగుతుంది. ఇలా ఓటీటీలోకి విభిన్న చిత్రాలు వస్తుండటంతో అభిమానులు కూడా వీటిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











