100 కోట్లకు అమ్మడుపోయిన ఆ స్టార్ హీరో సినిమా ఓటీటీ హక్కులు.. ఏదో తెలుసా?
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందానికి, సినిమాలకు తమిళంలోనే కాకుండా తెలుగులో సపెరేట్ గా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన చేసిన చాలా చిత్రాలు తెలుగులోకి కూడా డబ్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఈయన హీరోగా ఓ అద్భుతమైన సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఆ సినిమా పేరే విదా ముయార్చి. అయితే ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో బిజినెస్ చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ హక్కులే 100 కోట్లకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఎవరు కొన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అజిత్ తో పాటుగా అర్జున్ సర్జా, త్రిషా, రెజీనా కంసాడ్రాలు ప్రధాన పాతల్లో నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ముగిజ్ తిరుమెని దర్శకత్వం వహిస్తుండగా... అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకోవడంతో ఫ్యాన్సీ ధరకు ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అజిత్ కు ఇంత స్థాయిలో మార్కెట్ లేకపోయినప్పటికీ ఈ సినిమాకు మాత్రం పెద్ద మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం గమనార్హంగా మారింది.

ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్.. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఏకంగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఈ చిత్రం డిజిటల్ హక్కులను దక్కించుకుందట. అయితే ఈ అజిత్ విదా ముయార్చి సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడలో థియేటరల్లో విడుదల అయిన వెంటనే ఓటీటీలోనూ విడుదల చేస్తామని కూడా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. అలాగే ఈ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టెలివిజన్ దక్కించుకుంది.

అజిత్ సినిమా హక్కులు వంద కోట్లకు అమ్ముడుపోగా పెద్ద అడ్వాంటేజీగా మారింది. సినిమా విడుదలకు ముందుగానే భారీ ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడు పోగా.. సినిమా పెద్దగా ఆడకపోయినా హిట్ టాక్ రాకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదూ. అయితే సినిమా విడుదల తేజీ కూడా రాకముందే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. థియేటర్లలో ఏ రేంజ్ లో ఆడుతుందో, బాక్సాఫీసును ఎంతమేర షేక్ చేస్తుందో తెలియాలంటే మాత్రం ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. చూడాలి మరి ముందు ముందు ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











