Unstoppable with NBK: సూర్యను ప్రశ్నలతో ఇరుకున పెట్టిన బాలయ్య.. ఆ సీక్రెట్‌ కూడా లాగేసి..!

Unstoppable Season 4: గాడ్ ఆఫ్ మాసెస్ నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన టాక్ షో 'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే' (Unstoppable with NBK). ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే షోకు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకూ మూడు సీజన్లను సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో నాలుగో సీజన్‌లో అడుగుపెట్టింది. ఈ సీజన్ మొదటి షోకు తొలి గెస్ట్ నారా చంద్రబాబు నాయుడు రాకా.. రెండవ ఎపిసోడ్ కు గెస్టులుగా ఎవరు రానున్నారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ క్రమంలో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే 4 కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తాజాగా నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన 50 ఏండ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ , అవార్డులు అందుకున్నారు. ఇప్పటికి కూడా వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలతో సైతం పోటీ పడుతున్నారు .నందమూరి బాల‌కృష్ణ. ఆయన సినిమాల్లోనే కాదు. ఓటీటీ ఎంట్రీతో కూడా తన మార్క్‌ వైబ్రేషన్స్ క్రియేట్‌ చేశారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఆహా అనేంత క్రేజ్‌ సంపాదించుకున్నారు నందమూరి బాల‌కృష్ణ. అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే' టాక్ షోలో తనదైన హోస్టింగ్ స్టైల్‌తో అన్‌ స్టాపబుల్‌ రికార్డులు క్రియేట్‌ చేస్తున్నారు బాలయ్య.

Tamil star hero Surya Bollywood actor Bobby Deol participate in Nandamuri Balakrishna talk show Unstoppable with NBK S4

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో ఇప్పటివరకూ మూడు సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో నాలుగో సీజన్‌లో అడుగుపెట్టింది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో ఎంతో పాపులర్ అయింది.ఈ షోతోనే.. ఆహా సబ్‌స్క్రైబర్లు, వ్యూయర్‌షిప్ భారీగా పెరిగిందంటే అతిశయోక్తి కాదు. అలాగే ఈ క్రమంలోనే ఐఎండీబీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంలో, రీజినల్ లాంగ్వేజ్ కేటగిరీలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది అన్‌స్టాపబుల్. నాలుగో సీజన్ దసరా పర్వదినం రోజున లాంచ్ అయిన విషయం తెలిసిందే.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 4 వ సీజన్ కు తొలి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Chandra babu Naidu)విచ్చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత, రాజకీయ జీవిత విషయాలను వెల్లడించిన తొలి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదలైంది. అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే' టాక్ షో తాజా ప్రోమో నిమిషాల్లోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లక్షలాది వ్యూస్ సంపాదించుకుంది. తాజాగా ఈ టాక్ షో రెండవ ఎపిసోడ్ కు గెస్టులుగా ఎవరు రానున్నారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. 'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే' టాక్ షోకు తమిళ స్టార్ హీరో సూర్య కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నేడు (గురువారం) జరిగింది. హీరో సూర్య నటించిన కంగువ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో కలిసి బాలయ్య అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే' టాక్ షోకు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ టాక్ షోలో సూర్యను పలు ఇరకాటంతో పడేసే ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది.

ఇందులో హీరో సూర్యను.. జ్యోతిక తో ప్రేమ, పెళ్లి, విడాకుల రూమర్లు, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు హీరోయిన్లతో రొమాన్స్ తదితర విషయాలను అడిగినట్టు తెలుస్తోంది. మరి హీరో సూర్య ఎలాంటి సమాధానమిచ్చారో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X