PI Meena OTT: అమెజాన్ ప్రైమ్ లోకి మరో కొత్త క్రైమ్ డికెక్టివ్ డ్రామా, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓ అద్భుతమైన క్రైమ్ డికెట్టివ్ వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతుంది. దాని పేరే PI మీనా. ముఖ్యంగా పరంబ్రత ఛటోపాధ్యాయ, జిషు సేన్‌గుప్తాతో పాటు PI మీనాగా తాన్య మానిక్తలా ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రల్లో నటించారు. వినయ్ పాఠక్, జరీనా వాహబ్ లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే అత్యంత అద్భుతంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. అందేటంటే.. ఎన్నెన్నో చిక్కుముడులతో నిండి ఉన్న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది.
నవంబర్ మూడో తేదీ నుంచి PI మీనా వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైవ్ వీడియోలో అందుబాటులోకి రాబోతుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లు కల్గిన ఈ సిరీస్ ను హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ చేసే పరిశోధనను అందులో చూపించబోతున్నారు. ఎవరికీ తెలియని అత్యంత సీక్రెట్ అయిన ఓ రహస్యాన్ని మీనా చేధిస్తుంది. ఈ వెబ్ సిరీస్ ను దేబాలోయ్ భట్టాచార్య దర్శకత్వం వహించగా... అరిందమ్ మిత్ర ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

అనుమానాస్పద సంఘటనల వెనుక మిస్టరీని ఛేదించడానికి చేసిన ప్రయత్నాలను లోతుగా పరిశోధించే మీనా ఓ కనికరం లేని ప్రైవేట్ డిటెక్టివ్ గా ఈ వెబ్ సరీస్ లో కనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ గురించి దర్శకుడు దేబాలోయ్ భట్టాచార్య మాట్లాడుతూ... తనకు ఎప్పుడూ ఇవ్వెస్టిగేషన్ థ్రిల్లర్ పట్ల అమితమైన ఆసక్తి ఉండేదని... దానికి ఆకర్షితుడు కావడం వల్లే ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించినట్లు వివరించారు. పి.ఐ. మీనా తన మొదటి ప్రయత్నం అని.. ఇది అందరినీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా కథకు జీవం పోయడం మాత్రమే డైరెక్టర్ గా తాను చేశానని అన్నారు.

స్క్రిప్టులో పేజీలను సినిమాలాగా, వెబ్ సరీస్ లాగా... ముఖ్యంగా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దడం చాలా కష్టమైన పని అని... దేబాలోయ్ భట్టాచార్య తెలిపారు. ఎంతో మంది సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించగల్గినట్లు స్పష్టం చేశారు. ఎంతో అద్భుతంగా ఉండే ఈ వెబ్ సిరీస్ ను ప్రేక్షకులు ఎలా ఆధరిస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. చూడాలి మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో.


Click it and Unblock the Notifications











